
మరికొద్దిరోజుల్లో బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కన్‌ఫార్మ్ చేసేశారు. అయితే తారలు మాత్రమే ఉంటే ఎలా? సామాన్యులు కూడా ఉండాలని ఆలోచించారు. ఎవరో ఒకర్ని కాకుండా అగ్నిపరీక్ష అనే షో పెట్టి అందులో తమ సత్తా చూపించినవారికే రియాలిటీ షోలో అడుగుపెట్టే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అగ్నిపరీక్ష మొదలైంది. 15 మంది మధ్య పోటీ జరుగుతోంది.
ఓటేయండి ప్లీజ్
వీరిలో ఇన్‌ఫ్లుయెన్సర్ అనూష రత్నం (Anusha Ratnam) కూడా ఉంది. తాజాగా హాట్‌స్టార్ ఆమె ఓట్ అప్పీల్ చేసిన వీడియో రిలీజ్ చేసింది. అందులో అనూష మాట్లాడుతూ.. ఉద్యోగం చేశా, ట్యూషన్ టీచర్‌గా చేశా.. కంటెంట్ క్రియేటర్‌గానూ పని చేశాను. మీలో ఒకరిగా సోషల్ మీడియాలో ఎంటరయ్యాను. ప్రతి తెలుగింటికి నా గొంతు వినిపించాలంటే నన్ను బిగ్‌బాస్‌లోకి పంపించాలి. బిగ్‌బాస్‌కు నన్ను పంపించాలంటే ఓటింగ్ ముఖ్యం. కాబట్టి నాకు ఓటు వేసి పంపించండి.
గర్వపడేలా చేస్తా..
ఈమెను ఎందుకురా పంపించాం? అని నిరాశ చెందకుండా గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా.. మీ ఇంటి ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అంటూ తనకు ఓటేయమని వేడుకుంది. అనూష రత్నం వరంగల్ అమ్మాయి. తండ్రి మరణించడంతో చెల్లి చదువు బాధ్యతను తనే భుజాన వేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన ఆమె తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. ఇటీవల వర్జిన్ బాయ్స్ మూవీ ఈవెంట్‌లో యాంకరింగ్ కూడా చేసింది.
ఎవడ్రా బిగ్‌బాస్?
బిగ్‌బాస్‌కు వెళ్లాలని తహతహలాడుతున్న ఈమె గతంలో ఈ షోపై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదంటే? అందరూ బిగ్‌బాస్, బిగ్‌బాస్ అని బట్టలు చించేసుకుంటున్నారు. ఎవడ్రా బిగ్‌బాస్ అని హేళన చేసింది. కట్ చేస్తే అదే షోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన లైఫ్ స్టోరీ చెప్తూ ఎమోషనల్ కావడంతో ఆమెను నేరుగా టాప్ 15కి పంపించారు.
అప్పుడు విష్ణుప్రియ.. ఇప్పుడు అనూష
అక్కడినుంచి నేరుగా బిగ్‌బాస్ 9కి పంపమని వీడియోలు చేస్తోంది అనూష. మరి తను బిగ్‌బాస్ 9లో ఉంటుందా? లేదా? అనేది చూడాలి! గతంలో విష్ణుప్రియ కూడా.. షోకి వెళ్లేదే లేదని తెగేసి చెప్పింది. కట్ చేస్తే గత సీజన్‌లో ప్రత్యక్షమైంది. ఆట ఆడకుండా పిక్నిక్‌కు వచ్చినట్లు కూర్చుంది. మరి ఈ అనూష షోకి వెళ్తుందా? వెళ్తే ఎలా ఆడుతుంది? అన్నది చూడాలి!
చదవండి: కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. టీజర్ రిలీజ్