కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో.. టీజర్‌ రిలీజ్‌ | Raj Tharun Enter In Kollywood With Gods and Soldiers Movie | Sakshi
Sakshi News home page

Gods and Soldiers: 'గోలీసోడా' డైరెక్టర్‌తో రాజ్‌ తరుణ్‌ మూవీ.. ట్రైలర్‌ రిలీజ్‌

Aug 28 2025 6:31 PM | Updated on Aug 28 2025 6:38 PM

Raj Tharun Enter In Kollywood With Gods and Soldiers Movie

'గోలీసోడా', గోలీసోడా-2 చిత్రాల దర్శకుడు,ప్రముఖ కెమెరామెన్‌ విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో గోలీసోడా ఫ్రాంఛైజీ లో భాగంగా గోలీసోడాలోని స్పిరిట్‌ను.. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడు. ఆయన చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సునీల్‌, వేదన్‌, భారత్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

రఫ్‌ నోట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మాణంలో జరుపుకుంటోన్న ఈ చిత్రానికి వినాయక చవితి పర్వదినాన  'గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌'గా టైటిల్‌ని ఫిక్స్‌ చేసి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌..  ప్రముఖ తమిళ కథానాయకులు విజయ్‌ సేతుపతి, విజయ్‌ ఆంటోని, ఆర్యలతో పాటు మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ తమ ఎక్స్‌ అకౌంట్‌ వేదికగా టైటిల్‌ను ట్విట్‌ చేసి  శుభాకాంక్షలు అందజేశారు.

దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ '' గోలీసోడాలోని రఫ్‌నెస్‌ను, న్యూ చాప్టర్‌లో ఈ సినిమాలో ఆడియన్స్‌ చూడబోతున్నారు. ఈ టైటిల్‌ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టీజర్‌తో మా సినిమాపై ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. తప్పకుండా మా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అందరి అంచనాలను అందుకుంటుంది. ఈ సందర్బంగా మా టైటిల్‌ టీజర్‌ను తమ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మమ్ములను సపోర్ట్‌ చేసిన అందరికి ధన్యవాదాలు' అన్నారు. రాజతరుణ్‌, సునీల్‌, వేదన్‌, భారత్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిసున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement