బిగ్ బాస్ 8 ఫైనల్ లిస్ట్ ఇదే.. వీళ్లు పక్కా! | Bigg Boss Telugu Season 8 Contestants Full List Details And Other Highlights Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu Contestants: హౌసులోకి వచ్చే 14 మంది వీళ్లేనా?

Sep 1 2024 2:20 PM | Updated on Sep 1 2024 4:52 PM

Bigg Boss 8 Telugu Contestants Full List Details

బిగ్ బాస్ మరో సీజన్‌కి అంతా సిద్ధం. ఈసారి కూడా నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు. ఈపాటికే ప్రోమో రిలీజ్ చేయగా.. కంటెస్టెంట్స్ ఎవరనేది బయటపెట్టలేదు గానీ కొందరి గొంతులు వినిపించాయి. మరోవైపు గత కొన్నిరోజుల నుంచి కొన్ని పేర్లు తెగ వినిపించాయి. కానీ హౌసులోకి వెళ్లే 14 మంది ఎవరనేది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది.

(ఇదీ చదవండి: దీపికా పదుకొణెకు ప్రెగ్నెన్సీ.. అందుకోసం లండన్‌ వెళ్తున్నారా?)

ఈసారి హౌసులోకి వెళ్లే లిస్టులో చాలామంది పేర్లు వినిపించాయి కానీ చివరగా నైనిక, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, యష్మీ గౌడ, బేబక్క, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్, కిరాక్ సీత, సోనియా, ప్రేరణ వెళ్లడం పక్కా అని అంటున్నారు.

ఇక ఈ సీజన్‌ లిమిట్‌లెస్‌ అని చెప్పిన నాగార్జున.. అందుకు తగ్గట్టే కంటెస్టెంట్స్‌ని సోలోగా కాకుండా జోడీలుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్‌ చేశారు. అలానే రిలీజ్ చేసిన ప్రోమోలో 'సరిపోదా శనివారం' జోడీ నాని-ప్రియాంక, '35 చిన్న కథ కాదు' మూవీ ప్రమోషన్ కోసం రానా, నివేదా థామస్‌ వచ్చారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా సందడి చేశాడు. ఈరోజు సాయింత్రం 7గంటలకు స్టార్‌ మాలో బిగ్‌బాస్‌ ప్రసారం కానుంది.

(ఇదీ చదవండి: వీకెండ్‌లో దూసుకెళ్లిన సరిపోదా శనివారం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)

Advertisement
 
Advertisement
Advertisement