ప్రిన్స్‌ యావర్‌కు లవ్‌ స్టోరీ.. బ్రదర్స్ ఏమన్నారంటే? | Bigg Boss 7 Telugu Prince Yawar Brother's Emotional Interview - Sakshi
Sakshi News home page

Bigg Boss: యావర్‌కు ట్రోఫీ కంటే అదే ముఖ్యం.. అసలు కారణం చెప్పిన బ్రదర్స్!

Dec 13 2023 6:56 PM | Updated on Dec 15 2023 3:35 PM

Bigg Boss 7 Telugu Prince Yawar Brothers Emotional Interview - Sakshi

ప్రిన్స్ యావర్ ఈ పేరు గురించి ఇప్పుడు పరిచయం చేయాల్సిన పనిలేదు.  మోడలింగ్‌లో ఇప్పటికే సత్తా చాటిన యావర్.. బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు సరిగా రాకపోయినా హౌస్‌లో అడుగుపెట్టి అదరగొడుతున్నాడు. చివరివారం వరకు హౌస్‌లో ఉండి గ్రాండ్‌ ఫినాలేకు అర్హత సాధించాడు. అంతకుముందు ఎవరికీ తెలియని యావర్ తెలుగులో ఓ సీరియల్‌లో నటించారు.

ఆ తర్వాత కరోనా సమయంలో ఛాన్సులు లేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు ప్రిన్స్‌ యావర్‌. ఏదైనా ఉద్యోగం చేద్దామని అమీర్‌పేట్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అలాంటి యావర్ ఇప్పుడు బిగ్‌బాస్‌తో అందరికీ చేరువయ్యాడు. ఈ వారం గ్రాండ్ ఫినాలే జరుగుతున్న సందర్భంగా యావర్‌ బ్రదర్స్ ఓ ఇంటర్వ్యూకూ హాజరయ్యారు. యావర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాగా.. యావర్‌కు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. 

యావర్ హౌస్‌లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపారు. గేమ్‌లో భాగంగానే యావర్ సీరియస్‌గా రియాక్ట్ అయి ఉంటారని చెప్పారు. గేమ్‌లో అలాంటివన్నీ భాగం.. అందుకే హౌస్‌లో ఏం జరిగినప్పటికీ మేం ఫీల్ అవ్వడం లేదన్నారు. తాను ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రశాంత్, యావర్, శివాజీ ఫ్రెండ్‌షిప్‌ వెరీ గుడ్.. వాళ్లను అలా చూస్తుంటే మాకు సంతోషంగా ఉందన్నారు. వారిలో ఎవరు ట్రోఫీ గెలిచినా మాకు సంతోషమేనన్నారు. 

అయితే గ్రాండ్ ఫినాలేలో యావర్‌కు మనీ ఆఫర్ చేస్తే ట్రోఫీ తీసుకుంటాడా? మనీ తీసుకుంటాడా? అని యాంకర్‌ ప్రశ్నించారు. అయితే దీనికి యావర్ బ్రదర్ మాట్లాడుతూ.. యావర్‌కు చాలా లోన్స్ ఉన్నాయి.. అందువల్ల మనీకే ప్రయారిటీ ఇస్తాడని చెప్పుకొచ్చారు. అయితే యావర్‌ హౌస్‌లో అందరితో ఫ్రెండ్‌గానే ఉంటారని తెలిపారు. యావర్‌కు ఎలాంటి లవ్‌ స్టోరీ లేదని వివరించారు. ఎవరైనా ప్రపోజల్స్ వచ్చనా.. అతను పెద్దగా రియాక్ట్ కాడని చెప్పుకొచ్చారు. ఇంట్లో కూడా యావర్‌ చాలా సింపుల్‌గా ఉంటాడని బ్రదర్స్ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement