హౌస్‌లో రజనీకాంత్‌ సినిమాను వదలుకున్న హీరోయిన్‌! | Bigg Boss 7 Telugu: Kiran Rathore Entered as 12th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: 12వ కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ కిరణ్‌ రాథోడ్‌

Sep 3 2023 9:53 PM | Updated on Sep 11 2023 10:53 AM

Bigg Boss 7 Telugu: Kiran Rathore Entered as 12th Contestant - Sakshi

కిరణ్‌ రాథోడ్‌.. ఈమె బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ కజిన్‌ కూడా! హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేను చిత్రంతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీకి రజనీకాంత్‌ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో ఈ ఛాన్స్‌ వదిలేసుకుంది.

2016లో భాజా భజంత్రీలు(డబ్బింగ్‌) సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె ప్రస్తుతం రీఎంట్రీకి రెడీ అయింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ లియో సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో కిరణ్‌ రాథోడ్‌ బిగ్‌బాస్‌ 7లో అడుగుపెట్టింది. తనకు తెలుగు మాట్లాడటం రాదని, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానంది. మరి ఈ బ్యూటీ హౌస్‌లో తెలుగు నేర్చుకుంటుందా? లేదంటే తన వచ్చీరాని మాటలతో అందరినీ కన్‌ఫ్యూజ్‌ చేస్తుందా? చూడాలి!

Advertisement
 
Advertisement
Advertisement