పాటబిడ్డ కుండ పగిలింది.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: రైతుబిడ్డ పేరు జపం చేసిన అశ్విని.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?

Published Mon, Oct 16 2023 1:16 PM

Bigg Boss 7 Telugu: 7Th Week Nominations List - Sakshi

నయని పావని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో 13 మంది మిగిలారు. ఇప్పటివరకు పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా కొత్తగా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా విభజించిన సంగతి తెలిసిందే! నేటితో ఆ బేధాలు చెరిపేసి అందరూ సమానమే అని ప్రకటించాడు బిగ్‌బాస్‌. ఈ వారం కంటెస్టెంట్ల ఎదుట ఉన్న కుండను పగలగొట్టి నామినేషన్‌ చేయాలని తెలిపాడు.

ప్రశాంత్‌.. సందీప్‌ మాస్టర్‌, అమర్‌దీప్‌లను నామినేట్‌ చేశాడు. ఇక అమర్‌.. అశ్వినిని నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో అశ్విని మాట్లాడుతూ అమర్‌కు బదులుగా ప్రశాంత్‌.. ప్రశాంత్‌.. అని రైతుబిడ్డ పేరు జపించింది. అనంతరం పాటబిడ్డ భోలెను నామినేట్‌ చేశాడు అమర్‌. ఇది చూసి నవ్వుకున్న భోలె.. పదేళ్ల పిల్లాడిలా కనపడుతున్నావ్‌ అన్నాడు.

పూజా మూర్తి.. అశ్విని, భోలె షావళిని నామినేట్‌ చేసింది. ప్రోమో చూస్తుంటే ఎక్కువ ఓట్లు అశ్విని, భోలె షావళికి పడ్డట్లు కనిపిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ వారం అర్జున్‌, గౌతమ్‌, అమర్‌, భోలె, అశ్విని, తేజ, పూజ, శోభ, ప్రశాంత్‌ నామినేషన్‌లో ఉన్నారట! వీరిలో ఒకరిద్దరి పేర్లు అటుఇటుగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. శివాజీ హెల్త్‌ చెకప్‌, ట్రీట్‌మెంట్‌కు వెళ్లి తిరిగి హౌస్‌లోకి రానున్నాడు.

 
Advertisement
 
Advertisement