ఈ వారం వాళ్లిద్దరూ వెళ్లడం ఖాయమా? బిగ్‌బాస్‌ ఏదైనా మ్యాజిక్‌ చేస్తాడా?

Bigg Boss 6 Telugu: Who Will Eliminate for 14th Week - Sakshi

బుల్లితెర హిట్‌ షో బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌ ముగింపుకు వచ్చింది. ప్రారంభంలో పస లేని ఈ షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారింది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా క్లైమాక్స్‌కు వచ్చాక షో వెలుగులు సంతరించుకుంటోంది. మొన్నటికాదా గొడవలు, పగలతో రగిలిపోయిన హౌస్‌మేట్స్‌ ఇప్పుడిప్పుడే ఫన్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు మిగిలారు. ఇందులో ఒకరిని బయటకు పంపించే సమయం ఆసన్నమైంది.

ఆల్‌రెడీ శ్రీహాన్‌ టికెట్‌ టు ఫినాలే గెలిచి నామినేషన్స్‌ నుంచి తప్పించుకుని మొట్టమొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. రేవంత్‌ ఎలాగో విన్నర్‌ మెటీరియల్‌ కాబట్టి అతడు ఓటింగ్‌లో ఎప్పటిలాగే టాప్‌లో ఉంటూ వస్తున్నాడు. తర్వాతి స్థానాల్లో ఇనయ, ఆదిరెడ్డి, రోహిత్‌ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో శ్రీసత్య, కీర్తి తచ్చాడుతున్నారు. నిజానికైతే ఈ వారం శ్రీసత్య ఎలిమినేట్‌ కావాల్సిందే! కానీ ఫ్యామిలీ వీక్‌ తర్వాత శ్రీసత్యలో చాలా మార్పు వచ్చింది. వెటకారం పూర్తిగా తగ్గించేసింది. గేమ్‌లో తన ఫ్రెండ్స్‌ అని కూడా చూడకుండా శ్రీహాన్‌, రేవంత్‌పైనా అరిచేసింది. వరుస టాస్కులు గెలిచింది. అందరితో కలిసిపోయి గొడవలకు దూరంగా ఉంది. ఫలితంగా ఈ వారం తన గ్రాఫ్‌ బాగా పెరిగింది.

కీర్తి.. తన వేలి నొప్పి కారణంగా పలు టాస్కులు గెలవలేకపోయింది. అలా అని ఆడలేదని కాదు, తనవంతు ప్రయత్నం చేసింది. కానీ ప్రస్తుతం ఉన్నవారిలో ప్రేక్షకులు శ్రీసత్య, కీర్తిలలో ఒకరిని ఎలిమినేట్‌ చేయాలని భావిస్తున్నట్లు అనధికారిక పోల్స్‌ చెప్తున్నాయి. పైగా ఈ వారం శ్రీసత్య గ్రాఫ్‌ పెరిగి ఓట్ల శాతం పెరగడంతో కీర్తి వెనకబడినట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన కీర్తి ఎలిమినేట్‌ కావొచ్చేమో, లేదంటే శ్రీసత్య- కీర్తి ఇద్దరినీ బిగ్‌బాస్‌ బయటకు పంపించేస్తాడేమో! ఈ సీజన్‌ సిక్స్‌ కాబట్టి ఫినాలేకు సిక్స్‌ మెంబర్స్‌ను పంపించే ప్లాన్స్‌ ఉంటే మాత్రం వీళ్లిద్దరిలో ఏ ఒక్కరో ఎలిమినేట్‌ కాక తప్పదు. మరి బిగ్‌బాస్‌ ఎవరిని ఎలిమినేట్‌ చేస్తాడు? ఎవరు ఫినాలేకు దూరం కానున్నారో చూడాలి!

చదవండి: రోడ్డు మీద చెప్పుల్లేకుండా తిరిగా: శ్రీహాన​ గర్ల్‌ఫ్రెండ్‌ సిరి
ఫైమాకు గోల్డెన్‌ గిఫ్ట్‌ ఇచ్చిన ప్రియుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top