
బిగ్‌బాస్ గేమ్ షోలో ప్రతి ఆదివారం ఒకరు ఇంటి నుంచి బయటకు రావడం ఆనవాయితీ. వారం రోజుల్లో ఆడియన్స్ నుంచి ఎవరికి తక్కువ ఓట్లు పడితే వాళ్లు బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి ఎలిమినేట్ అవుతారు. బిగ్‌బాస్ 6లో మొదటి వానం మొత్తం ఏడుగురు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. వారిలో శ్రీసత్య, చంటి సేవ్ అయినట్లు శనివారం నాగార్జున ప్రకటించారు.ఇక మిగిలిన ఐదుగురిలో అంటే..రేవంత్, ఆరోహి, ఫైమా, ఇనయా సుల్తానా, అభినయశ్రీ లలో ఎవరో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లాలి.
ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది మరికొద్ది గంటల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో ఎలిమినేషన్‌కి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ హౌస్ నంచి ఈ వారం ఎవరిని బయటకు పంపడం లేదనేది ఆ వార్త సారాంశం. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఈ విషయం చివరల్లో నాగార్జున ప్రకటించనున్నారట.
ప్రస్తుతం నామినేషన్ లిస్ట్‌లో ఉన్న ఐదుగురిలో అభినయశ్రీ, ఇనయా సుల్తానాలను చివరి వరకు తీసుకొచ్చి, వారిలో నుంచి ఒకరిని బయటకు వెళ్తారని నాగార్జున చెబుతారట. కానీ చివర్లో ట్విస్ట్ ఇచ్చి ఇద్దరు సేఫ్ అయినట్లు ప్రకటిస్తారని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంత మంది అయితే కచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుందని, ఈ సారి ఇనయా సుల్తానా ఇంటి నుంచి బయటకు వెళ్తుందని చెబుతున్నారు. మరి లీకుల వీరులు చెప్పినట్లు నిజంగానే ఈ వారం ఎలిమినేషన్ ఉండదా? లేదా ఎవరో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్తారా? అనేది తెలియాలంటే ఏటి ఎపిసోడ్ చూడాల్సిందే.