Bigg Boss 6 Telugu Today Dongala Task Promo: No Food For BB6 Housemates - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ పనిష్మెంట్‌, తిండికి కటకట!

Oct 19 2022 3:34 PM | Updated on Oct 19 2022 5:58 PM

Bigg Boss 6 Telugu: No Food For Housemates - Sakshi

ఇంట్లోకి దొంగలను పంపించి వారు దాచుకున్న ఆహారాన్నంతా వెనక్కు లాగేసుకున్నాడు. మీకు తిండి దొరకాలంటే కూడా పోరాడి సాధించాలని కండీషన్‌ పెట్టాడు. దీంతో ఇంకో ఆప్షన్‌ లేక హౌస్‌మేట్స్‌ సరేనంటూ తలూపారు.

బిగ్‌బాస్‌ చెప్తే వినాలి, లేదంటే ఇదిగో ఇలానే అవుతుంది. అటు టాస్కులు సరిగా ఆడరు, ఇటు ఇంటి నియమాలూ పాటించరు. ప్రేక్షకులకు విసుగొస్తున్నా మారకపోతారా? ఆడకపోతారా? ఎంటర్‌టైన్‌ చేయకపోతారా? అన్న ఆశతో సీజన్‌ చూస్తూ వస్తున్నారు. కానీ వీళ్ల తీరు చూసి బిగ్‌బాస్‌ ఇక ఉండబట్టలేకపోయాడు. మొట్టమొదటిసారిగా తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. మీకు హౌస్‌లో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపోండి అని ఓ రేంజ్‌లో వార్నింగ్‌ ఇచ్చాడు.

తాజాగా బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు మరో లెవల్‌లో పనిష్మెంట్‌ ఇచ్చాడు. ఇంట్లోకి దొంగలను పంపించి వారు దాచుకున్న ఆహారాన్నంతా వెనక్కు లాగేసుకున్నాడు. మీకు తిండి దొరకాలంటే పోరాడి సాధించాలని కండీషన్‌ పెట్టాడు. దీంతో ఇంకో ఆప్షన్‌ లేక హౌస్‌మేట్స్‌ సరేనంటూ తలూపారు. ఆకలి నకనకలాడుతున్న సమయంలో బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించి కబడ్డీ ఆడించాడు. ఈ టాస్క్‌లో సూర్య టీమ్‌ గెలిచి ఫుడ్‌ సంపాదిచినట్లు తెలుస్తోంది. మరి ఆ టీమ్‌లో ఎవరెవరున్నారు? మిగతా టీమ్‌కు తిండి దొరికిందా? లేదా పస్తులున్నారా? వంటి వివరాలన్నీ తెలియాలంటే ఎపిసోడ్‌ కోసం ఎదురు చూడాల్సిందే!

చదవండి: ఏంటీ, చులకనా, వెళ్లిపోండి: బిగ్‌బాస్‌
ఆదిపురుష్‌ డైరెక్టర్‌కు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement