Bigg Boss 6 Telugu Promo: Keerthi Bhat Emotional And Beautiful Journey In BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: గ్రాండ్‌ ఫినాలేకు చేరుకోవడానికి కారణం నువ్వు కాదు.. కీర్తితో బిగ్‌బాస్‌

Dec 14 2022 4:34 PM | Updated on Dec 14 2022 7:15 PM

Bigg Boss 6 Telugu: Keerthi Bhat Gets To Go Through Her Beautiful Journey In BB House - Sakshi

ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతావారు నిందించినప్పుడు మీ మనసు గాయపడింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు వంద రోజులు ప్రయాణించారు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే వారు చేసిన చిలిపి పనులు, అల్లర్లు, కష్టాలు, కొట్లాటలు, కోపతాపాలు, సంతోషాలు, ఏడుపులు.. ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. వీటన్నింటి పరిగణనలోకి తీసుకున్న బిగ్‌బాస్‌ వారి వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు. తాజాగా కీర్తి గురించి బిగ్‌బాస్‌ మాట్లాడుడూ.. కల్పితం కన్నా నిజ జీవితం ఎంతో నాటకీయమైనది. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహిస్తుంటే మీరు చూపించిన గుండె నిబ్బరం ఎందరికో స్ఫూర్తి. అడవిలో మహావృక్షం ఒకటే ఉంటుంది.

అది తాను ఒంటరినని బాధపడి తల వంచితే ఆకాశం తాకే తన ఎదుగుదలను చూడలేదు. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతావారు నిందించినప్పుడు మీ మనసు గాయపడింది. కానీ మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి. గ్రాండ్‌ ఫినాలేకు చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీరు ఒక్కరు మాత్రమే కాదు, కుటుంబం కూడా! ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షలు. కష్టాల పునాదులపై నిర్మించి విజయాన్ని కదపడం అంత సులభం కాదు అంటూ బిగ్‌బాస్‌ కీర్తిని ఆకాశానికి ఎత్తేయడంతో ఆమె ఆనంద భాష్పాలు రాల్చింది.

చదవండి: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు: శ్రీహాన్‌

Advertisement
 
Advertisement
Advertisement