Bigg Boss 6 Telugu: Housemates are Ready for Another Challenge to Increase Prize Money - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఇంకెందుకు, మీరే ఆడుకోండి.. రేవంత్‌పై శ్రీసత్య ఫైర్‌

Dec 6 2022 5:15 PM | Updated on Dec 6 2022 5:32 PM

Bigg Boss 6 Telugu: Housemates Ready for Another Challenge to Increase Prize Money - Sakshi

ప్రతిసారి అబ్బాయిలు మాత్రమే అంటే ఇంకెందుకు గేమ్స్‌.. మీరే ఆడుకోండి, అమ్మాయిలు ఆడరు అని ఫైర్‌ అయింది. దీనికి రేవంత్‌.. నీకు ఆలోచించే శక్తి లేదా? యాటిట్యూడా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మొన్నటిదాకా ప్రైజ్‌మనీ కట్‌ చేస్తూ కంటెస్టెంట్ల ఆశల మీద నీళ్లు గుమ్మరించాడు బిగ్‌బాస్‌. తాజాగా ఆ కోల్పోయిన డబ్బులు తిరిగి సంపాదించుకునేందుకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. సమయానుసారం ఛాలెంజ్‌లు విసురుతూ.. అందులో ఎవరు గెలుస్తారో ముందే ఊహించాలని, కరెక్ట్‌గా గెస్‌ చేస్తేనే డబ్బులు తిరిగి ప్రైజ్‌మనీలో యాడ్‌ చేస్తానని ట్విస్ట్‌ ఇచ్చాడు. ఇప్పటికే ఒక ఛాలెంజ్‌ ఓడిపోయి, మరో ఛాలెంజ్‌ గెలిచిన హౌస్‌మేట్స్‌ తాజాగా మరో ఛాలెంజ్‌కు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

ఇందులో శ్రీసత్య, రేవంత్‌ గొడవపడ్డారు. నెక్స్ట్‌ గేమ్‌కు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వెళ్తారన్నావ్‌ కదా, ఎందుకు మాట మారుస్తున్నావని నిలదీసింది శ్రీసత్య. మొత్తం అన్ని గేమ్స్‌ అమ్మాయి- అబ్బాయి కలిసి ఆడతారని నేను చెప్పలేదే అని రేవంత్‌ అనగా కేవలం మొదటి మూడు రౌండ్స్‌ మాత్రమేనని కూడా చెప్పలేదు కదా అంది శ్రీసత్య. ప్రతిసారి అబ్బాయిలు మాత్రమే అంటే ఇంకెందుకు గేమ్స్‌.. మీరే ఆడుకోండి, అమ్మాయిలు ఆడరు అని ఫైర్‌ అయింది. దీనికి రేవంత్‌.. నీకు ఆలోచించే శక్తి లేదా? యాటిట్యూడా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇకపోతే ప్రస్తుతం ప్రైజ్‌మనీ రూ.39,10,000 ఉండగా దీన్ని రూ.లక్ష పెంచుకునేందుకు ఓ గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. మనీ ట్రాన్స్‌ఫర్‌ గేమ్‌లో కీర్తి- ఆదిరెడ్డి, శ్రీసత్య-శ్రీహాన్‌ ఆడారు. మొత్తానికి రేవంత్‌ను ఎదిరించి మరీ గేమ్‌ ఆడింది శ్రీసత్య. మరి ఈ ఆటలో ఏ జంట గెలిచింది? మిగతావాళ్లు ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్‌ చేశారా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

చదవండి: ఇప్పటికిప్పుడు ఛాన్స్‌ ఇస్తే రేవంత్‌ను పంపించేస్తా: ఫైమా
పైసా వసూల్‌ కోసం పోటీపడ్డ రేవంత్‌, ఇనయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement