Bigg Boss 6 Telugu: New Challenge For Revanth And Inaya Sultana - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: రేవంత్‌ Vs ఇనయ.. ప్రైజ్‌మనీకి జమ కానున్న డబ్బులు!

Dec 6 2022 3:52 PM | Updated on Dec 6 2022 4:23 PM

Bigg Boss 6 Telugu: New Challenge For Revanth And Inaya Sultana - Sakshi

అందుకోసం కొన్ని టాస్కులు గెలవాల్సి ఉంటుందని, ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్‌ చేయాలని మెలిక పెట్టాడు. అందుకు సరేనంటూ ఎగిరి గంతేశారు హౌస్‌మేట్స్‌. 

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకో గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఇప్పటివరకు కట్‌ అయిన డబ్బులను ప్రైజ్‌మనీలో యాడ్‌ చేస్తానన్నాడు. కాకపోతే అందుకోసం కొన్ని టాస్కులు గెలవాల్సి ఉంటుందని, ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్‌ చేయాలని మెలిక పెట్టాడు. అందుకు సరేనంటూ ఎగిరి గంతేశారు హౌస్‌మేట్స్‌. 

అందులో భాగంగా కంటెస్టెంట్లకు నేడు రెండో ఛాలెంజ్‌ ఇచ్చాడు. అందులో ఇనయ, రేవంత్‌ పోటీపడ్డారు. మెజారిటీ హౌస్‌మేట్స్‌ రేవంత్‌ గెలుస్తాడని భావించగా అదే నిజమైంది. దీంతో రూ.1,10,000 విన్నర్‌ ప్రైజ్‌మనీలో తిరిగి యాడ్‌ అయినట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్‌ ఇంకా ఏమేం ఛాలెంజ్‌లిచ్చాడు? ఎంత అమౌంట్‌ తిరిగి యాడ్‌ అయిందో తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేదాకా ఆగాల్సిందే!

చదవండి: హీరోయిన్‌ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement