Bigg Boss 6 Telugu Today Promo: Marina Fires On Geetu In Captaincy Contenders Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu : గీతూపై మెరీనా ఫైర్‌.. నా జోలికి రావొద్దంటూ వార్నింగ్‌

Oct 25 2022 4:51 PM | Updated on Oct 25 2022 5:26 PM

Bigg Boss 6 Telugu : Captaincy Contendersa Task Marina Fires On Geetu - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఈవారం పోటీదారుల కోసం చేపల చెరువు అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా వీలైనన్ని ఎక్కువ చేపల్ని తమ బుట్టలో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫైర్‌ లేదని బిగ్‌బాస్‌ మండిపడటంతో కంటెస్టెంట్లు తెగ కష్టపడుతున్నారు. వంత శాతం ఎఫర్ట్‌ పెట్టి మరీ చెడుగుడు ఆడేస్తున్నారు.

ఇక ఈ టాస్కులో ఇద్దరు సభ్యులను ఒక టీంగా విభజించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫిజికల్‌గా పోటీ పడకపోతే, మెంటల్‌గా రేవంత్‌ను దెబ్బకొట్టాలి అంటూ గీతూ ఆదికి సలహా ఇస్తుంది.

మరోవైపు గీతూకి, రోహిత్‌కి కూడా టాస్క్‌లో గొడవ అవడంతో..మెరీనాను ఉద్దేశించి మీరు ఎప్పుడూ భార్యభర్తలుగానే టాస్కులు ఆడుతున్నారంటూ గీతూ కౌంటర్‌ ఇవ్వగా, మెరీనా ఫైర్‌ అయ్యింది. నా జోలికి రావొద్దు..వస్తే మామూలుగా ఉండదంటూ మెరీనా విశ్వరూపం చూపించింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement