Bigg Boss 6: అర్జున్‌కు షాకిచ్చిన సత్య.. రోహిత్‌ కోసం మెరీనా త్యాగం | Bigg Boss 6 Telugu: 6th Week Nominations Has Twist | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: టైటిల్‌ కొడతానంటూ శపథం చేసిన ఇనయా.. సమస్యే లేదన్న శ్రీహాన్‌

Published Mon, Oct 3 2022 4:14 PM | Last Updated on Mon, Oct 3 2022 4:59 PM

Bigg Boss 6 Telugu: 6th Week Nominations Has Twist - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 ఇప్పుడు ఐదోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవారం నామినేషన్స్‌లో బిగ్‌బాస్‌ ఇద్దరు ఫ్రెండ్స్‌ మధ్యే భలే ఫిట్టింగు పెట్టాడు. ఇద్దరి చేతులకి సంకెళ్లు వేసి ఇద్దరిలో ఎవరు నామినేట్‌ కావాలో వాళ్లనే డిసైడ్‌ చేసుకోమని చెప్పడంతో అప్పటిదాకా ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్ల మధ్య కూడా వైరం మొదలైంది. ఇక ఈ నామినేషన్స్‌లో బిగ్‌బాస్‌ మరో ట్విస్ట్‌ కూడా పెట్టాడు. జంటగా హౌస్‌లోకి వచ్చిన మెరీనా అండ్‌ రోహిత్‌లకు షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ ఈసారి నుంచి ఎవరి ఆట వాళ్లు ఆడాలని పేర్కొన్నాడు. దీంతో మెరీనా రోహిత్‌ కోసం నామినేషన్‌ను త్యాగం చేసింది.

నేను వెళ్లిపోయినా సరే, నువ్వు ఉండాలి అంటూ భర్తకు సపోర్ట్‌ చేసింది. ఇక సుదీప, వాసంతిలలో ఈవారం సుదీప్‌ సేవ్‌ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు సత్య కోసం అర్జున్‌ నామినేట్‌ అయినట్లు ప్రోమోను బట్టి అర్థమవుతుంది. లాస్ట్‌ వీక్‌ నీకు హెల్ప్‌ చేశాను.. నువ్వు నామినేషన్స్‌లో ఉన్నా సేవ్‌ అవుతావ్‌ అని అర్జున్‌ బ్రతిమిలాడినా సత్య మాత్రం అందుకు ససేమీరా అనేసింది. నామీద పెట్టుకున్న నమ్మకం ఏదో నీమీద పెట్టుకో అంటూ సైలెంట్‌గానే షాకిచ్చింది.

ఇక శ్రీహాన్‌, ఇనయాల మధ్య మళ్లీ నామినేషన్స్‌ చిచ్చు రేపగా, రేసు నుంచి తప్పుకోవడానికి శ్రీహాన్‌ నిరాకరించాడు. దీంతో సరే నేనే నామినేషన్స్‌లో ఉంటా. టైటిల్‌ కప్పు కొట్టే వెళ్తానంటూ ఇనయా శపథం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement