Bigg Boss 5 Telugu: Swetha Varma Went To Jail As Worst Performer - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ర‌వి ఐడియాకు నిర్దాక్షిణ్యంగా బ‌లైన శ్వేత‌!

Oct 15 2021 12:37 PM | Updated on Oct 15 2021 3:16 PM

Bigg Boss 5 Telugu: Swetha Varma Went To Jail As Worst Performer - Sakshi

ఇక్క‌డో ట్విస్టుంది. నిజానికి కుష‌న్స్ పాడు చేసింది లోబో, శ్వేత అయిన‌ప్ప‌టికీ ఆ ఐడియా మాత్రం యాంక‌ర్ ర‌విది....

బిగ్‌బాస్ హౌస్‌లో గొడ‌వ‌లు, కొట్లాట‌ల‌కు కొద‌వ లేకుండా పోయింది. కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్ అయిన బొమ్మ‌ల కొలువులో త‌ల్లీకూతుళ్లయిన యానీ మాస్ట‌ర్‌, శ్వేత‌లు బ‌ద్ధ శ‌త్రువులుగా మారిపోయిన విష‌యం తెలిసిందే. సంచాల‌కులుగా వ్య‌వ‌హ‌రించిన‌ కాజ‌ల్‌, సిరి కూడా మా మాటే ఫైన‌ల్ అంటూ త‌మ‌కు న‌చ్చిన కండీష‌న్స్ పెట్ట‌డంతో హౌస్‌మేట్స్ రివ‌ర్స్ అయ్యారు. ఈ క్ర‌మంలో సంచాల‌కుల‌కు, ఇంటిస‌భ్యుల‌కు మ‌ధ్య కూడా పెద్ద‌ లొల్లి జ‌రిగింది. ఇదిలా వుంటే ఈ టాస్క్‌లో బిగ్‌బాస్ పంపిచే దూదిని మాత్ర‌మే వాడాల్సి ఉండ‌గా శ్వేత‌, లోబో.. హౌస్‌లోని కుష‌న్స్‌ను చింపేసి అందులోని దూదిని వాడి బొమ్మ‌లు త‌యారు చేశారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌కు సంబంధించిన ప్రాప‌ర్టీని ధ్వంసం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. వాళ్లిద్ద‌రూ కుష‌న్స్‌ను పాడు చేయ‌కుండా అడ్డుకోలేక‌పోయిన సంచాల‌కులు సిరి, కాజ‌ల్‌కు శిక్ష విధించాడు. సంచాల‌కులుగా విఫ‌ల‌మయ్యారంటూ వారిపై కెప్టెన్సీ అన‌ర్హ‌త వేటు వేశాడు. 

అయితే ఇక్క‌డో ట్విస్టుంది. నిజానికి కుష‌న్స్ పాడు చేసింది లోబో, శ్వేత అయిన‌ప్ప‌టికీ ఆ ఐడియా మాత్రం యాంక‌ర్ ర‌విది. దీంతో నీ వ‌ల్లే ఇదంతా జ‌రిగిందంటూ ర‌విని క‌డిగిపారేసింది శ్వేత‌. త‌న ఐడియా త‌ల‌కిందులు అవ‌డ‌మే కాక దానికి సిరి, కాజ‌ల్‌ అన్యాయంగా బ‌ల‌వ‌డంతో వారికి అంద‌రి ముందే సారీ చెప్పాడు ర‌వి. కానీ హౌస్‌మేట్స్ చాలామంది ర‌విని వ‌దిలేసి శ్వేత మీద గ‌ర‌మైన‌ట్లు తెలుస్తోంది. నేడు(శుక్ర‌వారం) వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌ను ఎన్నుకోవాల్సి ఉండ‌గా.. మెజారిటీ ఇంటిస‌భ్యులు శ్వేత‌ను చెత్త‌గా ఆడిన‌ట్లు పేర్కొని ఆమెను జైలుకు పంపించిన‌ట్లు స‌మాచారం. ఇది తెలిసిన ఆమె అభిమానులు.. ర‌వి వ‌ల్ల శ్వేత బ‌లైంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement