వాళ్లు టాప్‌ 5లో ఉంటారు: ఉమాదేవి | Bigg Boss 5 Telugu: Sakshi Interview With Uma Devi | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: వాళ్లు తప్పకుండా టాప్‌ 5లో ఉంటారన్న ఉమాదేవి

Sep 24 2021 9:46 PM | Updated on Sep 24 2021 9:56 PM

Bigg Boss 5 Telugu: Sakshi Interview With Uma Devi

మొదటివారం హౌస్‌మేట్స్‌కు ఉమాదేవస్య ఉగ్రరూపస్య సినిమా చూపించేసిందీ నటి. కానీ రెండోవారం తన కోపాన్ని కాస్త..

బిగ్‌బాస్‌ హౌస్‌ను గడగడలాడించింది ఉమాదేవి. మొదటివారం హౌస్‌మేట్స్‌కు ఉమాదేవస్య ఉగ్రరూపస్య సినిమా చూపించేసిందీ నటి. కానీ రెండోవారం తన కోపాన్ని కాస్త పక్కనపెడుతూ కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చింది. టాస్కుల్లో కాస్త హింసాత్మకంగానే ఆడినా లోబోతో చేసిన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించింది. అయితే ఆమె మాట్లాడిన బూతులే ఆమె పాలిట శాపంగా మారాయి. ప్రేక్షకులు ఆమె హౌస్‌లో ఉండటానికి వీల్లేదని డిసైడ్‌ చేయడంతో రెండోవారానికే తట్టాబుట్టా సర్దుకోక తప్పలేదు. 

తాజాగా ఉమాదేవి సాక్షి టీవీతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండోవారమే షో నుంచి వచ్చేయడం బాధగా ఉందని, ఇప్పటికీ బిగ్‌బాస్‌ హౌస్‌ను మిస్‌ అవుతున్నానని పేర్కొంది. ప్రియ, ప్రియాంకలతో కిచెన్‌లో కలిసి పని చేయడంతో తాము ఫ్రెండ్స్‌ అయ్యామని తెలిపింది. కెప్టెన్‌గా పని చేసిన సిరి, విశ్వలలో.. విశ్వ పర్ఫెక్ట్‌ అని చెప్పుకొచ్చింది. జెస్సీ, మానస్‌, రవి, సన్నీ.. టాప్‌ 5లో ఉంటారని అభిప్రాయపడింది. సన్నీ ఇంటాబయట ఒకేలా ఉన్నాడని, అందుకే అతడికి సపోర్ట్‌ చేస్తున్నానని తెలిపింది. ఆమె ఇంకా ఏం మాట్లాడిందో తెలియాలంటే కింది ఇంటర్వ్యూ చూసేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement