Bigg Boss 5 Telugu: ర‌వి ఫేక్‌, కాజ‌ల్ క‌న్నింగ్‌, మ‌రి స‌న్నీ, సిరి?

Bigg Boss 5 Telugu Promo: Ravi Fake, Kajal Cunning, Sunny Arrogant - Sakshi

Bigg Boss Telugu 5 Promo: సండేను ఫండే చేస్తానంటూ కంటెస్టెంట్ల‌తో టాస్క్‌లు ఆడిస్తుంటాడు నాగ్‌. అయితే కొన్ని ఫ‌న్నీగా ఉన్నా, మ‌రికొన్ని మాత్రం హౌస్‌మేట్స్ మ‌ధ్య చిచ్చు రాజేసేలా ఉంటాయి. తాజ‌గా అలాంటి టాస్కే హౌస్‌మేట్స్‌కు ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో.. నాగ్ కొన్ని ప‌దాలు ఇచ్చి అది ఎవ‌రికి సెట్ అవుతాయో చెప్పాల‌న్నాడు. దీంతో శ్రీరామ్‌.. గేమ్‌లో కాజ‌ల్ క‌న్నింగ్ అని చెప్పుకొచ్చాడు.

కాజ‌ల్‌.. సిరి గురించి చెప్తూ ఆమెకు రెండు ముఖాలున్నాయ‌ని, టాస్క్‌లో ఒక ఫేస్‌, సాధార‌ణంగా ఒక ఫేస్ ఉంటుంద‌ని తెలిపింది. ఇవి కాకుండా సిరి త‌న‌కు మూడో ఫేస్ కూడా ఉంద‌ని చెప్తూ ఉంటుంద‌ని, అది హౌస్ బ‌య‌ట‌కెళ్లాక చూపిస్తానంద‌ని పేర్కొంది. త‌ర్వాత స‌న్నీ.. ర‌వి మాట మార్చుతాడంటూ అత‌డు ఫేక్ అని చెప్పాడు. దీంతో చిర్రెత్తిపోయిన ర‌వి.. ఎంత‌ చెప్పినా విన‌కుండా నాకు న‌చ్చింది చేస్తా, ఎవ్వ‌డు చెప్పినా నేను విన‌ను అంటే అది యారోగెంటే క‌దా అంటూ ఆ ట్యాగును స‌న్నీ మెడ‌లో వేశాడు. ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు అంద‌రూ క‌రెక్ట్ ట్యాగులిచ్చుకుంటున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top