Bigg Boss 5 Telugu: బరిలో గెలిచెందెరు? కెప్టెన్‌ అయిందెవరు?

Bigg Boss 5 Telugu Latest Promo: Who Got Lightning Power - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ  కంటెండ‌ర్స్ టాస్క్‘సూపర్‌ విలన్స్‌ vs సూపర్‌ హీరోస్‌’రసవత్తరంగా సాగుతోంది. ఇరు గ్రూపుల సభ్యులు టాస్క్‌ కోసం ఏ రిస్క్‌ చేయడానికైనా సిద్దమవుతున్నారు. మరీ టాస్క్‌ కోసం ఫ్రెండ్‌షిఫ్‌ని కూడా పక్కన పెట్టేశారు. ఇప్పటి వరకు జట్టుగా ఆటలు ఆడించిన బిగ్‌బాస్‌.. ఇప్పుడు ఒక్కొక్కరిని బరిలోకి దింపుతున్నాడు. ఇరు జట్ల నుంచి ఒక్కొక్కరు ముందుకువచ్చి తమతమ ప్లాట్‌ఫామ్‌పై ఉండాలి.

ఎవరైతే ముందుగా ప్లాట్‌ఫామ్‌ నుంచి కిందకి పడిపోతారో వారు ఓడినట్లు. ఇందులో భాగంగా విలన్స్‌ టీమ్‌ నుంచి విశ్వ, హీరోస్‌ టీమ్‌ నుంచి మానస్‌ బరిలోకి దిగారు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఏ జట్టు కెప్టెన్సీ పోటీదారుగా ఎంపికైంది? తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top