బిగ్‌బాస్‌ : అవినాష్‌కి ఏమైంది..ఎందుకలా చేశాడు? | Bigg Boss 4 Telugu : What Is Relation Between Avinash And His Doll | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : అవినాష్‌కి ఆ బొమ్మకి ఉన్న రిలేషన్‌ ఏంటి? 

Nov 26 2020 4:14 PM | Updated on Nov 26 2020 4:25 PM

Bigg Boss 4 Telugu : What Is Relation Between Avinash And His Doll - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి దెయ్యం ఎపిసోడ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హౌస్‌మేట్స్‌ని భయపెట్టడంతో దెయ్యం విఫలమైంది. అరియానా మొదట్లో కాస్త భయపడినా.. దెయ్యం వాయిస్‌ విన్నాక ఆమె కూడా మిగతా సభ్యులాగే నార్మల్‌గానే ఉంది. ఇక అవినాష్‌, సోహైల్‌, హారిక అయితే దెయ్యంపైనే పంచ్‌లు వేస్తూ బిగ్‌బాస్‌ ప్లాన్‌కు బ్రేకులు వేశారు. దీంతో బిగ్‌బాస్‌ ఈరోజు ఎలాగైనా ఇంటి సభ్యులను భయపెట్టాలని ఫిక్స్‌ అయ్యాడు. గార్డెన్‌ ఏరియాతో పాటు, కన్ఫెషన్‌ రూమ్‌ను కూడా దెయ్యాల కొంపలుగా మార్చేశాడు. మరోవైపు అవినాష్‌ శ్మశానంలో కూర్చొని దెయ్యం పట్టినవాడిలా కిల కిల నవ్వుతున్నాడు.
(చదవండి : బిగ్‌బాస్‌ : ఆ ఇద్దరికే నా సపోర్ట్‌.. నాగబాబు)

అలాగే ఇంట్లో ఉన్న ఓ బొమ్మని దొంగిలించబోయాడు.  మిగిలిన ఇంటి సభ్యులు అవినాష్‌ని అడ్డుకొని బొమ్మను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హారిక కిందపడిపోయింది. అయినప్పటికీ అవినాష్‌ మాత్రం ఓ బొమ్మని తీసుకొచ్చి  బిగ్‌బాస్‌ హౌస్‌ బయటకి విసిరేశాడు. బయటకి విసిరేస్తే గేమ్‌ నుంచి అవుటైనట్లే అని అఖిల్‌ వార్నింగ్‌ ఇస్తున్నాడు. ఇంతకి అవినాష్‌ ఆ బొమ్మని ఎందుకు దొంగిలించాడు? అసలు ఆ బొమ్మకి అవినాష్‌కి ఉన్న సంబంధం ఏంటి? అవినాష్‌కి బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement