మోనాల్‌తో సోహైల్ హాట్ డ్యాన్స్‌ | Bigg Boss 4 Telugu: Syed Sohel And Monal Gajjar Hot Dance Performance | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: కెప్టెన్ లాస్య‌కు మాస్ట‌ర్ పంచ్‌

Sep 16 2020 4:47 PM | Updated on Sep 16 2020 5:02 PM

Bigg Boss 4 Telugu: Syed Sohel And Monal Gajjar Hot Dance Performance - Sakshi

బిగ్‌బాస్ షో ప్రారంభం అయిన తొలినాళ్ల‌లో మోనాల్ అయిన‌దానికీ, కానిదానికీ ఏడుస్తూ కూర్చుండిపోయింది. దీంతో ఈమెను ఎందుకు తీసుకొచ్చార్రా బాబోయ్ అని చాలామంది త‌ల‌లు ప‌ట్టుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. ఆమె వ‌ల్ల నీర‌సంగా సాగుతున్న‌ బిగ్‌బాస్ షో కాస్తా మ‌లుపు తిరిగి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌ట్టాలెక్కుతోంది. నేరుగా చూడ‌క‌ముందే ఆమెను పెళ్లి చేసుకుంటాన‌న్న అభిజిత్‌తో క‌లిసి బాగానే ఉంటోంది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా షేర్ చేసుకుంటోంది. ఇటు అఖిల్ ద‌గ్గ‌రా గారాలు పోతోంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఫ‌స్ట్ కెప్టెన్‌గా క‌ట్ట‌ప్ప‌!)

దివి క‌ళ్యాణితో మాస్ట‌ర్ డ్యాన్స్‌
తాజా ప్రోమోలో మోనాల్ వానా వానా వెల్లువాయే అనే రొమాంటిక్ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. కానీ అంద‌రూ ఊహించిన‌ట్టుగా అఖిల్‌, అభితో క‌లిసి కాదు. ఇస్మార్ట్ సోహైల్‌తో క‌లిసి హాట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. దీంతో అఖిల్ చేసేదేం లేక చ‌ప్ప‌ట్లు కొడుతూ చూస్తూ ఉండిపోయాడు. ఆ త‌ర్వాత దివి, క‌ళ్యాణితో క‌లిసి అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ స్టెప్పులేశాడు. ఈ డ్యాన్స్‌కు మంత్ర‌ముగ్ధురాలైన కెప్టెన్ లాస్య‌.. ఏం చేస్తిరి ఏం చేస్తిరి అని పొగ‌డ్త‌ల‌తో ముంచేయ‌బోతుంటే, మాస్ట‌ర్ ఇస్త్రీ చేశానంటూ పంచ్ విస‌ర‌డంతో అంద‌రూ న‌వ్వాపుకోలేక‌పోయారు. ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు చూడాలంటే మ‌రికొద్ది గంట‌లు ఆగాల్సిందే. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: సూర్య‌కిర‌ణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్‌!)

Advertisement
 
Advertisement
Advertisement