ఎలిమినేష‌న్‌: సోహైల్‌కు షాకుల మీద షాకులు | Bigg Boss 4 Telugu: Sohel Breaks Down Over Mehboob Elimination | Sakshi
Sakshi News home page

మెహ‌బూబ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సోహైల్‌

Nov 15 2020 5:14 PM | Updated on Nov 15 2020 7:43 PM

Bigg Boss 4 Telugu: Sohel Breaks Down Over Mehboob Elimination - Sakshi

'స్నేహం అంటే ప్రాణ‌మిస్తాం' అన్న డైలాగులు చాలా విన్నాం. కానీ స్నేహితులే త‌న ప్రాణ‌మ‌ని భావించే వ్య‌క్తి సోహైల్. అత‌డికి బిగ్‌బాస్ షాకుల మీద షాకులిస్తున్నాడు. అఖిల్‌ ఎలిమినేట్ అయ్యాడంటూ నిన్న‌టివ‌ర‌కు ఏడిపించిన‌ బిగ్‌బాస్ ఇప్పుడు మ‌రో ఫ్రెండ్ మెహ‌బూబ్‌ను నిజంగానే హౌస్ నుంచి పంపించి వేశాడు. ఈ బాధ‌ను త‌ట్టుకోలేక‌పోయిన సోహైల్ ఒక్క‌సారిగా క‌న్నీటిప‌ర్యంతం అయ్యాడు. ఇంత‌కు ముందు సీజ‌న్ల‌లో ఎలిమినేష‌న్ జ‌రిగిన‌ప్పుడు ఏడుస్తుంటే కంటెస్టెంట్ల ఓవ‌రాక్ష‌న్ ఏంద‌ని ఎగ‌తాళి చేసేవాళ్లం. కానీ ఇక్క‌డ నిజంగా ఆ ఎమోష‌న్స్ ఏంటో తెలుస్తున్నాయి అని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. బ్రెయిన్‌, మ‌న‌సు.. ఈ రెండింటితో కొట్లాడాల‌ని ఆవేద‌న చెందుతున్నాడు. అత‌డిని ఓదార్చ‌డం ఎవ‌రి త‌ర‌మూ కావ‌ట్లేదు. (చ‌ద‌వండి: సోహైల్ వేస్ట్‌గాడు, ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు: హారిక‌)

అటు హారిక, మోనాల్, అఖిల్‌‌ కూడా మెహ‌బూబ్ వెళ్లిపోతున్నందుకు ఏడ్చేశారు. ఈ ప్రోమో చూసి నెటిజ‌న్లు సైతం భావోద్వేగానికి లోన‌వుతున్నారు. సోహైల్ ఏడుపును డ్రామా కాద‌ని, వాళ్ల ఫీలింగ్స్‌ను ఎగ‌తాళి చేయ‌కండ‌ని ప‌లువురు సూచిస్తున్నారు. సోహైల్ ఏడుస్తుంటే మాకు తెలియ‌కుండానే దుఃఖం త‌న్నుకొస్తోంద‌ని ఆయ‌న అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక మెహ‌బూబ్‌కు ప్రారంభ ఎపిసోడ్లే దెబ్బ తీశాయ‌న్న‌ది తెలిసిన విష‌య‌మే. కానీ టాస్కుల్లో త‌న స‌త్తా చూపుతూ ఎదుటివారికి చెమ‌ట‌లు ప‌ట్టించాడు. అయితే బిగ్‌బాస్ అంటే కేవ‌లం ఫిజిక‌ల్ టాస్క్ మాత్ర‌మే కాద‌న్న విష‌యం తెలుసుకోలేక‌పోయాడు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఫ‌లితంగా మొద‌ట్లో అత‌డు చేసిన అతి వ‌ల్ల ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఇక బిగ్‌బాస్ బ‌జ్‌లో రాహుల్ సిప్లిగంజ్ మెహ‌బూబ్‌ను ఇంట‌ర్వ్యూ చేస్తున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ నుంచి మెహ‌బూబ్ అవుట్‌!)

Advertisement
 
Advertisement
Advertisement