బిగ్‌బాస్‌: దేత్త‌డి హారిక‌పై నెటిజ‌న్ల ఫైర్‌!

Bigg Boss 4 Telugu: Netizens Slam Dethadi Harika For Birthday Post - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ ఆదివారం అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ షోలోకి వెళ్లిన 16 మంది కంటెస్టెంట్ల‌లో దేత్త‌డి హారిక ఒక‌రు. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన హారిక‌కు ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉంది. మంగ‌ళ‌వారం హారిక పుట్టిన‌రోజు. నిజానికి గ‌తేడాది హారిక త‌న పుట్టిన‌రోజును చిన్న పిల్ల‌ల మ‌ధ్య జ‌రుపుకుంది. అంతే కాకుండా వారికి పండ్లు, బిస్కెట్లు కూడా పంచి పెట్టింది. ఈ ఫొటోల‌ను నిన్న ఆమె ఆమె కుటుంబ స‌భ్యులు హారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఆమె చేసిన ప‌నికి ప్ర‌శంస‌ల‌క‌న్నా విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఆ ఫొటోల‌ను ఇప్పుడే ఎందుకు బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు? అని నెటిజ‌న్లు ఆరాలు తీస్తున్నారు. "చీప్‌ ప‌బ్లిసిటీ స్టంట్" అని బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అఖిల్ పులిహోర‌, నోయ‌ల్ ద‌మ్కీ)

గ‌తేడాది ఈ ఫొటోలు పోస్ట్ చేయ‌కుండా ఇప్పుడు మాత్ర‌మే వాటిని షేర్ చేస్తుందంటే క‌చ్చితంగా బిగ్‌బాస్ ఓట్ల కోస‌మేన‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎవ‌రు ఎంత కాకా ప‌ట్టినా త‌మ‌ ఓటు గంగ‌వ్వ‌కేన‌ని క‌రాఖండిగా చెప్తున్నారు. "మొద‌టి వారంలోనే మొద‌లు పెట్టేశారా?", "అయినా ఇప్పుడు ఎలిమినేష‌న్ జోన్‌లో లేదుగా... ఎందుకీ సెల్ఫ్ డ‌బ్బా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు హారిక అభిమానులు కూడా ఈ పోస్ట్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ స‌మ‌యంలో ఇవ‌న్నీ చేస్తే సింపతీ కోస‌మే అనుకుంటార‌ని, కాబ‌ట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాల‌ని కోరుతున్నారు. ఏది ఏమైనా ఆ బ‌ర్త్‌డే ఫొటోల‌ను కావాల‌ని షేర్ చేసినా, అల‌వాటులో పొర‌పాటుగా అభిమానుల‌తో పంచుకున్నా హారిక‌కు నెటిజ‌న్ల నుంచి విమ‌ర్శ‌లు త‌ప్పడం లేదు. (చ‌ద‌వండి: శివ‌జ్యోతిని మించిపోయిన మోనాల్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top