ఇప్పుడు తన వంతు అంటోన్న మోనాల్‌ | Bigg Boss 4 Telugu: Monal Gajjar Supports First Finalist | Sakshi
Sakshi News home page

ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్‌కు మ‌ద్ద‌తు తెలిపిన మోనాల్‌

Dec 14 2020 7:53 PM | Updated on Dec 14 2020 7:53 PM

Bigg Boss 4 Telugu: Monal Gajjar Supports First Finalist - Sakshi

బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌ క‌థ కంచికి చేరుతోంది. ఈ త‌రుణంలో లోపల ఉన్న త‌మ‌ ఫేవ‌రెట్‌ కంటెస్టెంట్లను గెలిపించేందుకు అభిమానులు న‌డుం క‌ట్టారు. హాట్‌స్టార్ ఓటింగ్‌తో పాటు మిస్‌డ్ కాల్స్ ద్వారా నిన్న‌టి నుంచే ఓట్ల వ‌ర‌ద పారిస్తున్నారు. మ‌రోవైపు టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల కోసం ఇప్ప‌టికే ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్స్ స‌పోర్ట్ చేస్తున్నారు. ముక్కు అవినాష్‌, దేవి నాగ‌వ‌ల్లి.. అరియానాకు, నోయ‌ల్‌.. హారిక‌కు మ‌ద్ద‌తిస్తుండ‌గా మోనాల్ గ‌జ్జ‌ర్‌ త‌న క్లోజ్ ఫ్రెండ్, ఫ‌స్ట్ ఫైన‌లిస్ట్‌ అఖిల్ కోసం రంగంలోకి దిగింది. (చ‌ద‌వండి: అభిజిత్‌కు సపోర్ట్ చేస్తున్న రౌడీ హీరో)

ప‌ద్నాలుగు వారాలు హౌస్‌లో త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించిన మోనాల్‌ నిన్న‌టితో బిగ్‌బాస్‌కు వీడ్కోలు ప‌లికింది. ప్ర‌తిదానికి ఏడుస్తూ న‌ర్మ‌ద‌గా పేరు గ‌డించిన ఆమె ఇంటి నుంచి న‌వ్వుతూ వెళ్లిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా అఖిల్ త‌న బెస్ట్‌ఫ్రెండ్ అని ముందుగానే క్లారిటీ ఇచ్చింది. షో మొద‌టి రోజు నుంచి అత‌డు త‌న‌కు స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డాడ‌ని చెప్తూ ఇప్పుడు అఖిల్ కోసం నిల‌బ‌డాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని పేర్కొంది. అఖిల్‌కు ఓటేయండ‌ని పిలుపునిచ్చింది. అలాగే సోహైల్‌, హారికకు కూడా స‌పోర్ట్ చేయండ‌ని అభిమానుల‌ను కోరింది. కాగా షో నుంచి ఎలిమినేట్ అయిన అనంత‌రం మోనాల్ చిలుకూరి బాలాజీ దేవాల‌యాన్ని సంద‌ర్శించిన‌ట్లు స‌మాచారం. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచేందుకు అన‌ర్హులు ఎవ‌రు?)

Advertisement
 
Advertisement
Advertisement