జోక‌ర్‌గా నవ్విస్తానంటున్న ముక్కు అవినాష్‌ | Bigg Boss 4 Telugu: Jabardasth Avinash Is Second Wild Card Contestant | Sakshi
Sakshi News home page

వినోదాన్ని రెట్టింపు చేయ‌నున్న‌ జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్‌

Sep 17 2020 3:38 PM | Updated on Dec 6 2020 10:56 PM

Bigg Boss 4 Telugu: Jabardasth Avinash Is Second Wild Card Contestant - Sakshi

పేరు: ముక్కు అవినాష్‌
స్వ‌స్థ‌లం: క‌రీంన‌గ‌ర్‌
విద్య‌: ఎంబీఏ

కామెడీ పండించే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా పాపులర్ అయిన క‌మెడియ‌న్, మిమిక్రీ ఆర్టిస్ట్‌ ముక్కు అవినాష్‌. అస‌లు పేరు క‌ల్ల అవినాష్‌. జ‌బ‌ర్ద‌స్త్‌కు వెళ్ల‌డానికి ముందు అత‌డు కెవ్వు కేక‌, త‌డాఖా వంటి అడ‌పా ద‌డ‌పా కామెడీ షోల‌లో క‌నిపించాడు. అప్ప‌టికే జ‌బ‌ర్ద‌స్త్‌లో ఉన్న చ‌మ్మ‌క్ చంద్ర అవినాష్ ప్ర‌తిభ‌ను గుర్తించి జ‌బ‌ర్ద‌స్త్‌కు ట్రై చేయ‌మ‌ని చెప్పాడు. అనూహ్యంగా అత‌డు సెల‌క్ట్ అయి జ‌బ‌ర్దస్త్‌లో ఓ భాగం కావ‌డం అత‌‌ని జీవితాన్నే మ‌లుపు తిప్పింది. త‌న స్కిట్టుల‌తో, హావ‌భావాల‌తో ప్రేక్ష‌కును పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. అత‌ని టాలెంట్ చూసి సినీ ప‌రిశ్ర‌మ కూడా ర‌మ్మ‌ని స్వాగ‌తం ప‌లికింది. అలా అత‌డు నాన్న, నేను, నా బాయ్‌ఫ్రెండ్స్‌, కొంచెం ఫ‌న్ కొంచెం ర‌న్‌, నార నార‌దులు వంటి ప‌లు సినిమాల్లో న‌టించాడు. 

ఇత‌ని తండ్రి ముంబైలో అనిల్ క‌పూర్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ స‌హా ప‌లువురు ద‌ర్శకు‌ల‌కు డ్రైవ‌ర్‌గా ప‌ని చేశాడ‌ని అంటుంటారు. కాగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక వెల‌వెల‌బోతున్న బిగ్‌బాస్ హౌస్‌లో రెండో వారంలోనే రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంటుగా అడుగు పెట్ట‌బోతున్నాడు. మ‌రి అత‌డు వినోదాన్ని రెట్టింపు చేస్తాడా? ప‌్రేక్ష‌కుల‌ను త‌న హాస్యంతో మెప్పిస్తాడా? అనేది చూడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement