బిగ్‌బాస్‌: బిగ్‌బాస్‌: మరోసారి నామినేట్‌ అయిన గంగవ్వ

Bigg Boss 4 Telugu: Gangavva Nominated For Second Week Also - Sakshi

కరోనా కారణంగా కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనా బిగ్‌బాస్జనాల్లో మెల్లమెల్లగా పుంజుకుంటుంది. వారం రోజులుగా  చప్పగా సాగిన కంటెస్టెంట్ల ప్రదర్శనలో మెరుగు కన్పిస్తోంది. తొటి సభ్యులతో పరిచయాలు పెంచుకుంటూ ప్రస్తుతం హుషారుగా ఉన్నట్లు కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రెండో వారం రానే వచ్చింది. అర్థరాత్రి బిగ్‌బాస్‌లోకి ప్రవేశించిన కుమార్‌ సాయి దొంగలా దాక్కొని.. అక్కడ ఉన్న దేవితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోకి ఎవరో వచ్చారని గమనించిన దేవి అతని ముఖం చూసేందుకు సాహసించింది. అయితే తనను చూడొద్దని దేవిని భయపెడుతూ సభ్యులను పిలుచుకు రావాలని కుమార్‌ కోరాడు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి సాయి కుమార్‌తో మాట్లాడి ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారని పసిగట్టారు. (బిగ్‌బాస్‌: నువ్వు హీరోయిన్‌, నేను హీరో)

అంతేగాక అభిజిత్‌, మోనాల్‌ అర్థరాత్రి ఏకాంతంగా గుసగుసలు పెట్టుకున్నారు. ఇక ఉదయం కూడా మళ్లీ మోనాల్‌, అభిజిత్‌ రహస్యంగా మాట్లాడుకోవడంతో  వీరి మధ్య ఎదో ఉందని ప్రజలకు సందేహిస్తున్నారు. అదే విధంగా అఖిల్‌ మోనాల్‌ గురించి లాస్యతో చాడీలు చెప్పేందుకు ప్రయత్నించి వెంటనే మళ్లీ మోనాల్‌ను పిలిచి తనతో కాస్తా కొంటెగా ముచ్చటించాడు. అఖిల్‌ వద్దకు వచ్చిన మోనాల్‌ ఎదో చెప్పే ప్రయత్నం చేయబోతుంటే యదవ యాక్టింగ్‌లు చేయకు అంటూ అఖిల్‌ నోరు పారేసుకున్నాడు. నీకేం చేయాలో తెలియదా అని అఖిల్‌ అనగానే. మంచిగా మాట్లాడు అంటూ మోనాల్‌ కూడా కొం‍చెం సీరియస్‌ అయ్యింది. ఇక ఈ వాదన అయిపోగానే ఇద్దరి మధ్య ఏర్పడిన చిరు గొడవను డైవర్ట్‌ చేస్తూ మోనాల్‌ను కూల్‌ అయ్యేలా మస్కా కొట్టాడు. మరోలా ఆలోచిస్తే ఈ రోజు చర్చంతా మోనాల్‌పై జరిగినట్లు కన్నిస్తోంది. (బిగ్‌బాస్‌: సూర్య‌కిర‌ణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్‌!)

ఇదిలా ఉండగా ఈ రోజు నుంచి రేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇంటి సభ్యులకు కావాల్సిన రేషన్‌ను దక్కించుకునేందుకు ఒకిరిని రేషన్‌ మేనేజర్‌గా ఎన్నుకోవాలి. వారికి రూమ్‌ తాళం ఇచ్చి అందులోని సమన్లు తెచ్చుకోవాలి. అ క్రమంలో ఈ పోస్టును అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్‌ లాస్య అప్పగించడంతో మాస్టర్‌, కెప్టెన్‌ లాస్య స్టోర్‌ రూమ్‌కు వెళ్లి కావాల్సిన వస్తువులను తీసుకొచ్చారు. (బిగ్‌బాస్‌: ముందు తనే వెళ్లిపోతానన్న గంగవ్వ)

ఇక రెండో వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని 16 మంది గార్డెన్‌ ఏరియాలో ఉన్న పడవలోకి ఎక్కాలి. పడవ ప్రతి తీరం మధ్య ఆగినప్పుడు ఒక్కో సభ్యుడు దాని నుంచి ఖచ్చితంతగా దిగిపోవాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది తీరాల మధ్య పడవ ఆగుతుంది. అంటే 9 మంది నామినేషన్‌ అవుతారు. ఇక పడవలోకి కూర్చొని సభ్యులంతా సరదాగా పాటలతో హోరెత్తించారు. ఇక మొదటి తీరం రాకముందే పడవ నుంచి నేను పోత అంటే నేను దిగపోతా అంటూ ముందుకు వచ్చారు. ఇంతలోనే దిగేందుకు సరైన కారణం చెబితే తాను దిగిపోతానని కుమార్‌ సాయి తెలిపాడు. దీంతో ఎవరిని పడవ నుంచి దింపేయాలన్న చర్చ సభ్యుల్లో సాగింది. ఇంతోనే అభిజిత్‌ కలగజేసుకొని అవ్వ ఎక్కవ సేపు కూర్చోలేదని చెబుతూ మొదట పడవ దిగమని చెబుతామా అని సలహా ఇచ్చాడు. దానికి అవ్వ సరే చెప్పి తొలి రౌండ్‌లోనే దిగిపోయింది. అయితే ఊహించని విధంగా నోయల్‌ రెండో హారన్‌కు దిగిపోయాడు. మోనాల్‌ మూడో హారన్‌కు పడవ నుంచి దిగేసింది. (మైండ్ బ్లాక్ చేసిన దివి, దేవి)

ఇంట్లోకి వచ్చిన కుమార్‌ మొదటి రోజే ఇంటి సభ్యులతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నట్లు తెలుస్తోంది. మనసులో దిగాలని లేకపోయిన మీరు చేస్తే దిగుతా అంటూ ప్రతి రౌండ్‌లో తెలివి ప్రదర్శిస్తూ వచ్చాడు. నాలుగో రౌండ్‌ మోగగానే పోహైల్‌, అయిదో బజర్‌కు కరాటే కళ్యాణి దిగిపోయింది. ఆరో హారన్‌కు అమ్మ రాజశేఖర్‌ పడవ నుంచి దిగేసి ఇంట్లోకి వచ్చేశారు. ఏడవ రౌండ్‌లో కుమార్‌, ఎనిమిది హారిక, తొమ్మిది అభిజిత్‌ దిగిపోయాడు. అయితే నామినేషన్‌లోకి వెళ్లినా తిరిగి సేఫ్‌ అవ్వగలం అన్న నమ్మకం ఉన్న వారు పడవ నుంచి దిగేసినట్లు తెలస్తోంది. నామినేట్‌ అయితే ఎలిమినేట్‌ అవుతామన్న భయంతో సుజాత, మెహబూబ్‌, దివి, అఖిల్‌ గుట్టు చప్పుడు కాకుండా చివరి దాకా పడవలోనే ఉన్నారు. చివరికి ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. గంగవ్వ, నోయల్‌, మోనాల్‌, సోహైల్‌, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్‌, కుమార్‌ సాయి, హారిక, అభిజిత్‌ నామినేట్‌ అయ్యారు. మరి ఈ వారం సేఫ్‌ అయ్యేది ఎవరో, ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో తెలియాలంటే ఈ వారమంతా బిగ్‌బాస్‌సై ఓ కన్ను వేయాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top