త‌న భయాన్ని చూసి న‌వ్వుకున్న అరియానా

Bigg Boss 4 Telugu: Finale Week Fun Is On With Rap Song - Sakshi

బిగ్‌బాస్ గూటి కింద చేరిన కంటెస్టెంట్లు ఒక‌రితో ఒక‌రు క‌లిసిపోయారు. ప్రేక్ష‌కుల‌తో క‌నెక్ట్ అయ్యారు. పొద్దున ఏదైనా పాట వేస్తే త‌ప్ప నిద్ర లేవ‌ని ఇంటి స‌భ్యుల కోసం బిగ్‌బాస్ ఈ రోజు స్పెష‌ల్ సాంగ్ వేయించిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇందులో ఇంటిస‌భ్యుల‌ మాట‌లు, పాట‌లు, అల‌క‌లు, ఏడుపులు, హెచ్చ‌రిక‌లు అన్నీ క‌ల‌గ‌లిపి ఉన్నాయి. ఇది విన్న‌ కంటెస్టెంట్లు కొంత ఆశ్చ‌ర్యం, మ‌రికొంత ఆనందంతో ఈ ర్యాప్ సాంగ్‌కు మ‌రింత ఉత్సాహంగా స్టెప్పులేస్తున్నారు. బిగ్‌బాస్ కోరిక మేర‌కు అభిజిత్ తెలుగులో మాట్లాడండి అన్న వాక్యం రాగానే అభి లోలోప‌లే స‌ర‌దాగా న‌వ్వుకున్నాడు. దెయ్యం టాస్కులో అరియానా అద్దంలో దెయ్యాన్ని చూసి జ‌డుసుకుని ఏడ‌వ‌డం కూడా ఈ ర్యాప్ సాంగ్‌లో భాగం కావ‌డంతో అంద‌రూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. (చ‌ద‌వండి: ఆ ఒక్క‌రికే రాహుల్ సిప్లిగంజ్‌స‌పోర్ట్!)

మొత్తానికి ఈ ర్యాప్‌తో బిగ్‌బాస్ ఫినాలేలో ఉన్న‌ ఇంటి స‌భ్యుల‌కు వారి ప్ర‌యాణాన్ని అంతా గుర్తు చేసిన‌ట్లైంది. ఈ వారంతో బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌కు శుభం కార్డు ప‌డుతుండ‌టంతో మిగిలిన ఐదుగురు ఇంటి స‌భ్యులు కూడా ఎవ‌రి దారి వారు చూసుకోనున్నారు. ఇటు ప్రేక్ష‌కులు కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిస్స‌వ‌నున్నారు. ఈ విష‌యాన్ని ప‌దేప‌దే గుర్తు చేసుకుంటూ బిగ్‌బాస్ ప్రేమికులు డీలా ప‌డిపోతున్నారు. వ‌చ్చేవారం నుంచి బిగ్‌బాస్ ఉండ‌ద‌ని తెగ‌ బాధ‌ప‌డుతున్నారు. అరియానా బోల్డ్‌నెస్‌, సోహైల్ కామెడీ, హారిక క్యూట్‌నెస్‌, అభిజిత్ తెలివైన మాట‌లు, అఖిల్ పాటలు అన్నింటికీ దూర‌మ‌వుతామంటున్నారు. ఈ సీజ‌న్ చాలా తొంద‌ర‌గా పూర్తైన‌ట్లు అనిపిస్తోందని చెప్తున్నారు. మొద‌ట్లో వీళ్లంతా ఎవ‌రు అనుకున్న‌వాళ్లేవాళ్లు ఇప్పుడు త‌మ‌ ఫేవ‌రెట్ కంటెస్టెంట్ల‌ను మిస్ అవుతామ‌ని భారంగా కామెంట్లు చేస్తున్నారు. (చ‌ద‌వండి: నీతో టైమ్ స్పెండ్ చేయాల‌ని ఉంది: మోనాల్)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top