ఫినాలే పోరు: ఆ న‌లుగురి మ‌ధ్యే పోటీ

Bigg Boss 4 Telugu: Avinash Asks Bigg Boss To Eliminate Him - Sakshi

బిగ్‌బాస్ ప్ర‌యాణం తుది అంకానికి చేరుకుంటోంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు మాత్ర‌మే మిగిలారు. వీరిలో ఒక‌రు టాప్ 5లో బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకునేందుకు బిగ్‌బాస్ రేస్ టు ఫినాలే టాస్క్ ఇచ్చాడు. ఇందులో గార్డెన్ ఏరియాలో ఓ ఆవు బొమ్మ ఉంటుంది. అంబా.. అన్న శ‌బ్ధం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా కంటెస్టెంట్లు దాని దగ్గ‌ర‌కు వెళ్లి పాలు ప‌ట్టుకోవాలి. ఎవ‌రు ఎక్కువ పాల బాటిళ్లు నింపుతే వారు రెండో లెవ‌ల్‌కు అర్హత సాధిస్తారు. ఈ టాస్కులో గెలిస్తే ఇంటిస‌భ్యుల‌కు రెండు ర‌కాల ప్ర‌యోజనం ఉంటుంది. వాళ్ల గేమ్ న‌చ్చితే ప్రేక్ష‌కులు ఓట్లు గుద్దుతారు. అలాగే గేమ్‌లో విజ‌యం సాధిస్తే రెండో లెవ‌ల్‌కు అర్హ‌త సాధిస్తారు. ఆ లెవ‌ల్‌లో కూడా విజ‌యాన్ని ముద్దాడితే నేరుగా ఫైన‌ల్‌లో అడుగు పెట్టిన‌ట్లే.. ఇక ఈ టాస్కులో ఒక‌రి మీద ఒక‌రు ప‌డుతూ ప‌క్క‌నోళ్ల‌ను తోస్తూ కంటెస్టెంట్లు గేమ్ ఆడుతున్నారు. పక్క‌వాళ్ల పాల డ‌బ్బాల‌ను విసిరేస్తూ మ‌రీ ప్ర‌తాపం చూపిస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: తెలివైన నిర్ణ‌యం తీసుకున్న అవినాష్‌)

ఈ క్ర‌మంలో అవినాష్సోహైల్ మ‌ధ్య గొడ‌వ రాజుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. అస‌హ‌నంతో ఊగిపోయిన అవినాష్‌ అంద‌రూ ఒక్క‌‌టైపోయార‌ని మండిప‌డ్డాడు. త‌న వ‌ల్ల కాద‌ని, త‌న‌ను ఎలిమినేట్ చేసేయండని బిగ్‌బాస్‌కు చెప్పాడు. ఇక ఇప్ప‌టికే ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌తో సేవ్ అయినందుకు అవినాష్ ఓర‌క‌మైన నిస్తేజంలో ఉన్నాడు. త‌న‌కు ప్రేక్ష‌కుల స‌పోర్ట్ త‌గ్గిపోయిందేమోన‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. సేవ్ అయ్యాన‌న్న సంతోషం క‌న్నా పాస్ లేక‌పోయుంటే ఎలిమినేట్ అయ్యేవాడిని అన్న బాధే అత‌డిని ఎక్కువగా వేధిస్తోంది. ఇంకా దాన్ని  ప‌ట్టుకుని వేలాడుతూ ఉండ‌టం వ‌ల్లే ఈ వారం అత‌డు నామినేష‌న్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని కాసేపు ప‌క్క‌న‌పెడితే రేస్ టు ఫినాలే టాస్క్‌లో అఖిల్‌, అభిజిత్‌, సోహైల్‌, హారిక రెండో లెవ‌ల్‌కు అర్హ‌త సాధించిన‌ట్లు స‌మాచారం. మ‌రి వీరిలో టికెట్ అందుకునే అదృష్ట‌వంతులు ఎవ‌రో చూడాలి. (చ‌ద‌వండి: మోనాల్ నాకోసం స్టాండ్ తీసుకోవాల్సింది: అభిజిత్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top