హారిక‌ను చుమ్మా ఇవ్వ‌మ‌ని బెదిరించిన అఖిల్‌

Bigg Boss 4 Telugu: Ariyana Fun With Sohel In His Ruling - Sakshi

నామినేష‌న్‌లో అఖిల్ త‌ప్ప అంద‌రూ

స్విమ్మింగ్ పూల్‌లో బ‌ట్ట‌లు ప‌డే‌సిన హారిక‌

ఆమెను చుమ్మా ఇవ్వ‌మ‌ని అఖిల్ బెదిరింపు

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఆఖ‌రి నామినేష‌న్స్ జ‌రిగాయి. కాక‌పోతే ఎలాంటి టాస్కూ పెట్ట‌కుండా బిగ్‌బాస్ అఖిల్ మిన‌హా అంద‌రినీ నేరుగా నామినేట్ చేశాడు. అనంత‌రం వారికి ఇచ్చిన రాజారాణీ టాస్క్‌లో ఎవ‌రికి న‌చ్చిన రూల్స్ వాళ్లు పెట్టుకున్నాడు. అరియానాను ఏడిపించాల‌నుకున్న సోహైల్ క‌ల నెర‌వేర‌లేదు. రాజైన సోహైల్‌నే అరియానా మూడు చెరువుల నీళ్లు తాగించింది. హారిక రాణి అయిన‌ప్పుడు మాత్రం చిన్న‌పాటి గొడ‌వ‌లు జ‌రిగాయి. ముఖ్యంగా హారిక‌ను అఖిల్ ముద్దివ్వ‌మ‌ని బ‌తిమాలాడ‌టం మ‌రీ దారుణంగా అనిపించింది. మొత్తానికి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో చ‌దివేయండి..

బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అరియానా
అవినాష్ పోయిన బాధో, లేదా మ‌రో రెండు వారాలే ఉంద‌న్న భ‌య‌మో తెలీదు కానీ అరియానాకు త‌న జీవితం అంతా బుర్ర‌లో గిర్రున తిరిగింది. వెంట‌నే కెమెరా ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. "నా మొద‌టి జీతం రూ. 4 వేలు. నేను చాలా క‌ష్ట‌ప‌డి ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఎంత సంపాదించినా నా వ‌ర‌కు సంతోషంగా ఉన్నా. కానీ ఈ షోకు మాత్రం క‌ప్పు కొట్టాల‌నే వ‌చ్చాను. ఈసారి మ‌హిళ విన్న‌ర్ కావాల‌న్న కోరిక‌తో అడుగుపెట్టాను. ఇక్క‌డ‌ మ‌హారాణిలా బ‌తుకుతున్నా.. ఒక్కోసారి ఈ భోగానికి నేను అర్హురాలు కాదేమో అనిపిస్తుంది. కానీ ప్యాలెస్‌లో ఉండాల‌న్న క‌ల ఎట్ట‌కేల‌కు తీరింద"‌ని బిగ్‌బాస్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంది.

స‌క‌ల భోగాలు అనుభ‌వించిన సోహైల్‌
త‌ర్వాత అఖిల్ మినహా అంద‌రూ నామినేట్ అయిన‌ట్లు బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. మిమ్మ‌ల్ని మీరు నిరూపించుకోండంటూ 'అధికారం' అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు, రాణి అయ్యేవాళ్లు బిగ్‌బాస్ రూల్స్‌ను మార్చుతూ సొంత నియ‌మాలు పెట్టొచ్చని చెప్పాడు. ఈ టాస్కులో అఖిల్ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తాడు. మొద‌ట బ‌జ‌ర్ మోగ‌గానే కిరీటాన్ని అందుకుని సోహైల్ రాజుగా అవ‌త‌రించాడు. కిచెన్ ద‌గ్గ‌ర పడేసి ఉన్న బోళ్లు తోమ‌మ‌ని అరియానాను ఆదేశించాడు. మంత్రితో మ‌సాజ్ చేయించుకున్నాడు. హారిక‌తో ఫ్రూట్స్ తినిపించుకున్నాడు. ఈ క్ర‌మంలో మీరే ద‌య‌త‌ల‌చి అఖిల్‌కు, నాకూ పెళ్లి చేయాల‌ని హారిక‌ రాజాను అభ్య‌ర్థించింది. (అవినాష్ అవుట్‌: అభిజిత్‌పై బిగ్‌బాంబ్‌)

అనుకున్న‌ది ఒక్క‌టి, అయిన‌ది ఒక్క‌టి
మ‌రోవైపు అరియానా చేస్తున్న అతిని త‌ట్టుకోలేక‌ రాజే స్వ‌యంగా ఆమె ముఖాన ట‌మాట‌లు రుద్దాడు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన అరియానా అరుపులు, కేక‌ల‌తో హౌస్‌ను ద‌ద్ద‌రిల్లేలా చేసింది. అరియానా అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ఆమె నెత్తి మీద నీళ్లు గుమ్మ‌రించాడు. ఆమె వేసే జింతాత జింతాత స్టెప్పులో త‌న‌కు ఫ్యూచ‌ర్ క‌నిపిస్తుంద‌ని సోహైల్ భ‌య‌ప‌డ్డాడు. ఇంత‌లో సోహైల్ గ‌డువు ముగిసింది. దీంతో అత‌డు త‌న కిరీటాన్ని అభిజిత్‌కు అప్ప‌గించాడు. (మోనాల్ నాకోసం స్టాండ్ తీసుకోవాల్సింది: అభిజిత్‌)

హారిక చుమ్మా కోసం అఖిల్ బ‌ల‌వంతం
త‌ను రాజుగా ఉన్నంత‌కాలం హారిక మాట‌కు ముందోసారి, చివ‌రోసారి ఇకిలి పికిలి అనే ప‌దాన్ని ఉప‌యోగించాల‌ని అభిజిత్‌ హారికను ఆదేశించాడు. త‌ర్వాత మోనాల్ పాట పాడ‌గా దానికి సోహైల్‌, అరియానా రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. అనంత‌రం మ‌హారాణిగా మారిన హారిక‌.. త‌ను చెప్పిన‌వి చేయ‌క‌పోతే బ‌ట్ట‌లు స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేస్తాన‌ని హెచ్చ‌రించింది. దీంతో అంత ప‌ని చేయొద్దంటూ ఆమెను కూల్ చేసేందుకు సోహైల్ ముద్దు పెట్టాడు. అక్క‌డే ఉన్న‌ అఖిల్ ఛాన్సు వ‌దిలేది లేద‌ని క‌క్కుర్తి పడ్డాడు. నాకు కూడా పెట్టాల్సిందేన‌ని ప‌ట్టుప‌డ్డాడు. రాణి కాలం ముగిశాక పెడ్తాన‌ని చెప్పి హారిక ఆ స‌మ‌యానికి త‌ప్పించుకుంది.

పొగిడాన‌నుకున్నావా, అదంతా తూచ్‌
ఇక అభిజిత్ కూడా హారిక‌ను పొగిడిన‌ట్లే పొగిడి ఇదంతా అబ‌ద్ధ‌మ‌ని ఝ‌ల‌క్ ఇవ్వ‌గా ఆగ్ర‌హించిన రాణి అత‌డి బ‌ట్ట‌ల‌ను స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేసింది. త‌ర్వాత‌ పువ్వుతో నాన్‌స్టాప్‌గా ప్ర‌పోజ్ చేయాల‌ని సోహైల్‌ను ఆదేశించింది. ఇది చాలా ఈజీ అని అఖిల్ చెప్ప‌డంతో హారిక మ‌రో టాస్క్ ఇచ్చి దాన్ని 15 సెక‌న్ల‌లో పూర్తి చేయాలంది. దీంతో తిక్క లేచిన సోహైల్ బాడీ లాంగ్వేజే మారిపోయింది. అయినా స‌రే వినిపించుకోని రాణి రెండు షూల లేస్‌ను క‌లిపి క‌ట్టుకొని డ్యాన్స్ చేయాలంది. ఆమె ముందు గాల్లోకి లేస్తూ డ్యాన్స్ చేసిన సోహైల్ లోప‌ల‌కు వ‌చ్చి త‌న ఉక్రోషాన్ని వెల్ల‌గ‌క్కాడు. (బిగ్‌బాస్‌ : వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా అభిజిత్‌.. జైలు శిక్ష)

స‌మానంగా చూడ‌లేద‌ని అఖిల్‌పై ఫైర్‌
మంత్రి మ‌ధ్య‌లో ఎందుకు దూరుతున్నాడ‌ని  సోహైల్‌ ఆగ్ర‌హించాడు. నేను రాజుగా ఉన్న‌ప్పుడు ఒక్క ప‌ని చేయ‌లేదు కానీ ఆమె రాణిగా ఉన్న‌ప్పుడు మాత్రం అన్ని ప‌నులు చేస్తున్నాడ‌ని అఖిల్ మీద మండిప‌డ్డాడు. బ‌ట్ట‌లు నీళ్ల‌లో ప‌డేయ‌డం ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాద‌ని చెప్పాడు. నా బ‌ట్ట‌లు ప‌డేసి చూడ‌మ‌ను, అంద‌రివి నీళ్ల‌ల్లో వేసి ఉతుకుతా అని ఫ్ర‌స్టేట్ అయ్యాడు. ఇక‌ అఖిల్ పాట‌కు అరియానా చేసిన డ్యాన్స్ బాగుంది. అలా హారిక రాజ్యం గొడ‌వ‌ల‌తోనే జ‌రిగిపోయింది. రేపు మోనాల్‌, అరియానా రాణిగా ఎలా చెల‌రేగిపోతారో చూడాలి. (బిగ్‌బాస్‌: నిజంగానే మోనాల్ త‌న్నిందా?)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top