బిగ్‌బాస్‌ : వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా అభిజిత్‌.. జైలు శిక్ష

Bigg Boss 4 Telugu : Abhijeet Jailed For Worst Performer - Sakshi

సోహైల్‌ త్యాగం.. అఖిల్‌ విజయం

అవినాష్‌ ఒగ్గకథకు హౌస్‌మేట్స్‌ ఫిదా

జైలు పాలైన అభిజిత్‌

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ వరస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా తనను ఎంచుకోండని అభిజిత్‌ బిగ్‌బాస్‌ను వేడుకున్నాడు. తాను గత వారం ఓ తప్పు చేశానని, అందుకు శిక్షగా తనను చెత్త ఆటగాడిగా ప్రకటించాలని కోరారు. ఇంతకీ అభిజిత్‌ చేసిన తప్పేంటి? ఇంట్లో ఎవరు బెస్ట్‌ ఫెర్ఫార్మర్‌ అయ్యారు? అసలు బెస్ట్‌, వరస్ట్‌ బిరుదు ఎవరు, ఎందుకు ప్రకటించారో చదివేద్దాం.

టికెట్‌ టూ ఫినాలే విన్నర్‌ అఖిల్‌
'టికెట్ టు ఫినాలే' రేస్‌లో భాగంగా సోహైల్‌, అఖిల్‌ రాత్రి మొత్తం ఉయ్యాలపైనే కునుకు తీశారు. ఇక వారితో పాటు సంచాలకుడిగా వ్యవహరిస్తున్న అఖిల్‌ కూడా గార్డెన్‌ ఏరియాలోనే ఉండిపోయాడు. ఉదయం అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఇద్దరూ ఉయ్యాలలనే ఉండిపోయారు. ఇక ఎలాగో వీళ్లు దిగేలా లేరని ఫిక్సయినా అభి.. ఇద్దరూ ఆలోచించుకోండి అని సలహా ఇచ్చాడు. దీంతో సోహైల్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఇక అఖిల్‌ ఏమో అమ్మ సెంటిమెంట్‌ను తీసుకొచ్చాడు. ‘ఈ గేమ్ ఇద్దరికీ ఇంపార్టెంటే.  మా అమ్మ వచ్చి కెప్టెన్ అవ్వు అని అడిగినా నేను కాలేకపోయా. నేనే టాప్‌ 5 ఉంటానని అమ్మకు చెప్పా. మా అన్న వచ్చి కూడా నన్ను టాప్ 5లో పెట్టలేదు. అదే కొంచెం భయంగా ఉంది’ అంటూ సోహైల్‌ని సెంటిమెంట్‌ దెబ్బ కొట్టాడు. దీంతో కరిగిపోయిన సోహైల్‌.. ఉయ్యాల దిగేందుకు సిద్దమయ్యాడు. కానీ అఖిల్‌ అడ్డుకొని వద్దని వారించాడు. 

పర్లేదు నేను దిగుతా.. ఈ గేమ్ నాకు కూడా ఇంపార్టెంటే కానీ.. నీ కోసం నేను దిగుతా.. మనం సాయంత్రం వరకూ ఉండమన్నా ఉంటాం.. అది బిగ్ బాస్‌కి కూడా తెలుసు. నా భయం ఏంటంటే మళ్లీ బిగ్ బాస్ ఎలాంటి అనౌన్స్‌మెంట్ ఇస్తారో గేమ్ అటూ ఇటూ కాకుండా పోతుంది. నువ్వూ నేనూ ఉడుము పట్టే వెనక్కి తగ్గం’ అని సొహైల్ అనడంతో అఖిల్ నేను నామినేషన్‌లో ఉన్నా.. ఒక వేళ నేను ఈ వీక్‌ ఎలిమినేట్‌ అయితే టికెట్‌ ఫినాలే వృధా అయిపోతుంది. అందుకే నువ్వే ఆ టికెట్‌ తీసుకో. నన్ను ఉయ్యాలలో నుంచి తోసెయ్‌ అని చెప్పాడు. దీంతో సోహైల్‌ మరోసారి ఎమోషనల్‌ అయి గట్టిగా ఏడ్చేశాడు. 

అనంతరం ఏం చేద్దాం అని అఖిల్ అడగడంతో.. నాకేం అర్థం కావడం లేదు అఖిల్.. నువ్ నన్ను తమ్ముడిలా తీసుకున్నావ్.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యావ్.. ఎవర్నీ నన్న చూసుకున్నట్టు చూసుకోలేదు అని సొహైల్ ఎమోషనల్ కావడంతో అఖిల్ ఇంకా ఎక్కువ ఏడ్చేశాడు. చివరికి మా వల్ల కావడం లేదు బిగ్ బాస్ ఏదొకటి చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అనంతరం కొంచె జరుగు అని చెప్పి సోహైల్‌ ఒక్కసారిగా ఉయ్యాల నుంచి కిందిగి దిగేశాడు. దీంతో షాకైన అఖిల్‌.. భోరున విలపించాడు. మొత్తానికి సొహైల్ చేసిన త్యాగంతో అఖిల్ టికెట్‌ టు ఫినాలే మెడల్ సాధించి టాప్ 5కి వెళ్లాడు.ఈ టాస్క్ విజేత కావడంతో బిగ్ బాస్ సీజన్ 4లో మొదటి ఫైనలిస్ట్ అయ్యాడని బిగ్ బాస్ అభినందించారు. ఈవారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయితే నేరుగా ఫినాలేకి వెళ్తారని చెప్పారు బిగ్ బాస్.

థ్యాంక్స్‌ అభి.. అఖిల్‌
నిన్న హారికతో జరిగిన గొడవను అభిజిత్‌ క్లియర్‌ చేసుకున్నాడు. నా విషయంలో ఒక స్టాండ్‌ తీసుకోలేవు అంటూ బాధపడ్డాడు. ఒక్కసారి కూడా నాకు హెల్ఫ్‌ చేయలేదని, నేను చెప్పిన విషయాలను కూడా సీరియస్‌ తీసుకోవని కొంచెం అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను నీ ఫ్రెండ్‌గా చెప్తున్నా.. కొన్ని కొన్ని విషయాలను అర్థం చేసుకుని నీ ప్రాబ్లమ్ ఇదీ అని చెప్తావని చూస్తా. కానీ నువ్ స్టాండ్ తీసుకోవు’ అని అభిజిత్‌ బాధపడ్డాడు. ‘స్టాండ్ తీసుకోవడం అంటే ఏంటి.. అభి? ఒకేదాని కోసం ఎందుకు ఆలోచిస్తూ కూర్చోవడం మర్చిపోవచ్చు కదా అని చెప్పా అంతేగా అని హారిక తనను తాను సమర్థించుకుంది. మర్చిపో అంటున్నావ్ తప్పితే హెల్ప్ చేయడం నీ వల్ల కావడం లేదా? నువ్ అర్థం చేసుకోవా? అని అభిజిత్ తిరిగి ప్రశ్నించాడు. అలాగే అఖిల్‌ గురించి మాట్లాడుతూ.. తాను నన్ను ఓరేయ్‌ అనొద్దని చెప్పినందుకు నామినేట్‌ చేశాడు. నేను ఎవరితో ఇలా మాట్లాడా అంటూ యాటిట్యూడ్‌ చూపించాడని అఖిల్‌పై  తన అక్కసును వెళ్లగక్కుతుండగా.. సడన్‌గా అఖిల్‌ వచ్చి అభికి థ్యాంక్స్‌ చెప్పాడు. దీంతో కంగుతిన్న అభి.. నీ గురించే మాట్లాడుకుంటున్నామని ఉన్న ముచ్చట చెప్పాడు. ఇక టికెట్‌ టూ ఫినాలేలో మాతో పాటు నువ్వు కూడా నిద్రపోకుండా ఉన్నావని, మంచిగా సపోర్ట్‌ చేశావంటూ మరోసారి అభిజిత్‌కి థ్యాంక్స్‌ చెప్పాడు అఖిల్‌.

నాగార్జునకు జోడిగా నటిస్తా : మోనాల్‌
ఇంటి సభ్యులకు ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌ను పెట్టాడు బిగ్‌బాస్‌. అందరూ రౌండ్‌గా నిలబడి రియల్‌ మ్యాంగో డ్రింక్‌ తాగుతూ ఒకరి నుంచి ఒకరికి పాస్‌ చేయాలని, ఎవరిదగ్గరైతే మ్యాంగో డ్రింక్‌ అయిపోతుందో వాళ్లు ట్రూత్‌ అండ్‌ డేర్‌ గేమ్‌ ఆడాలని చెప్పాడు. మొదటగా సోహైల్‌ ఓడిపోయి.. డేర్‌ ఎంచుకున్నాడు. అందుకుగాను మ్యాంగో డ్రింక్‌ బాటిల్‌ని చేతులతో టచ్‌ చేయకుండా నోటితో తాగి విజయం సాధించాడు. అనంతరం అభిజిత్‌ ఓడిపోయి ట్రూత్‌ ఎంచుకొని తన స్కూల్‌ డేస్‌లోని క్రష్‌ ఉన్నా అమ్మాయిల పేర్లు చెప్పాడు. ఆ తర్వాత మోనాల్‌ ట్రూత్‌ ఎంచుకుంది. వరణ్‌ తేజ్‌, నాగార్జున, విజయదేవరకొండ, అల్లు అర్జున్‌తో చాన్స్‌ వస్తే మొదట ఎవరితో సినిమా చేస్తావని అడగ్గా.. మోనాల్‌ తెలివిగా నాగార్జున పేరు చెప్పి మార్కులు కొట్టేసింది.

అవినాష్‌ ఒగ్గు కథకు హౌస్‌మేట్స్‌ ఫిదా
ఇక ఇంటి సభ్యులను నవ్వించడంలో ఎప్పుడు ముందుండే అవినాష్‌.. ఈ సారి ఒగ్గుకథతో ఇంటి సభ్యులను ఆకట్టుకున్నాడు. కిచెన్‌ వంట చేస్తున్న అరియానా, మోనాల్‌ దగ్గరికి వెళ్లి ఒగ్గుకథ రూపంలో వారిని పొగిడాడు. అరియానాను ఇలియానాలో పోల్చుతూ..తనదైన శైలీలో పొగిడేశాడు. అవినాష్‌ పొగడ్తలకు పొంగిపోయిన అరియానా.. ఒక్కసారిగా వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇలా ప్రతి ఒక్కరిని ఒగ్గుకథ రూపంలో పొగిడాడు. దీంతో ఇంటి సభ్యులంతా ఎమెషనల్‌ అయి.. అవినాష్‌ని హగ్‌ చేసుకున్నారు. ఇంటి సభ్యుల ప్రేమకు అవినాష్‌ కూడా ఫిదా అయిపోయాడు.
 

బెస్ట్‌ ఫెర్ఫార్మర్‌ సోహైల్‌.. వరస్ట్‌ ఫెర్ఫార్మర్‌ అభిజిత్‌
గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా నెంబర్‌ గేమ్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. దీని ప్రకారం.. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఆరుగురు సభ్యులు తాము ఏ స్థానానికి అర్హులమో చెప్పి.. ఆ నెంబర్ ముందు నిల్చోవాల్సి ఉంటుంది. అందులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిని బెస్ట్‌ ఫెర్మార్మర్‌ ఆఫ్‌ దీ సీజన్‌గా, చివరి స్థానంలో ఉన్న వారిని వరస్ట్‌ ఫెర్మార్మర్‌ ఆఫ్‌ది సీజన్‌గా ప్రకటిస్తానని బిగ్‌బాస్‌ ముందే అనౌన్స్‌ చేశాడు. టికెట్‌ టు ఫినాలే గెలినందున అఖిల్‌కు ఈ టాస్క్‌ నుంచి మినహాయింపు లభిచింది. ఇక ఉన్న మిగతా ఆరుగురిలో మొదటి స్థానంలో సోహైల్‌, రెండో స్థానంలో అరియానా, మూడో స్థానంలో హారిక, నాల్గో స్థానంలో మోనాల్‌, ఐదో, ఆరో స్థానాల్లో అవినాష్‌, అభిజిత్‌ నిలబడ్డారు. ఆ తర్వాత వారు ఏ స్థానం కోరుకుంటున్నారో ఇలా వివరించారు.

సోహైల్‌ : ఏ టాస్క్‌ ఇచ్చినా 100 శాతం చేశా. తప్పు చేయకున్నా కొన్నిసార్లు సారీ చెప్పా. కోపం ఉన్నా.. టాస్క్‌లు మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు.అందుకే నాకు మొదటి స్థానం కావాలి

అరియానా : బిగ్‌బాస్‌ ఆట వ్యక్తిగతం. కొన్ని టాస్క్‌లు కలిసి ఆడాల్సి వస్తోంది. మరికొన్ని వ్యక్తిగతంగా ఆడాలి. అలాంటి టాస్క్‌లను గేను సాధ్యమైనంత వరకు వ్యక్తిగతంగానే ఆడాను. అందుకే నేను కూడా మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాను

అవినాష్‌ : ఇంట్లో తక్కువ నామినేట్‌ అయింది నేను ఒక్కడినే. వరస్ట్‌ ఫెర్మారర్‌ అని ఒక్కరు కూడా అనలేదు. కొన్ని తప్పిదాలు చేశాను కాబట్టి నాకు రెండో స్థానం కావాలని కోరుకుంటున్నా.

హారిక : కెప్టెన్‌గా ఉన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్‌ చేశాను. అందుకే టాప్‌ 2 కావాలి.

మోనాల్‌ : జనాల వల్ల ప్రతి వారం నామినేషన్‌లో ఉన్నా.. సేవ్‌ అవుతూ 13వ వారానికి చేరుకున్న. గేమ్‌ కూడా ఆడుతున్నా. నాకు మూడో స్థానం కావాలి.

అభిజిత్‌ : నేను మొదటి నుంచి గేమ్‌ బాగా ఆడాను.  ప్రతి టాస్క్‌ వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడాను. గత వారం మిస్టేక్ తప్పితే(మోనాల్‌ని డేట్‌ తీసుకెళ్లనని చెప్పడం), టాస్క్‌ పరంగా నేను ఎప్పడు వెనుకడుగు వేయలేదు.  అయితే ఆ ఒక్క విషయంలో నేను పొరపాటు చేశాను. కాబట్టి ఈ సీజన్‌ వరస్ట్‌ ఫెర్ఫార్మర్‌ తీసుకోవాడిని రెడీగా ఉన్నా.

ఇలా కొన్ని వాదలన అనంతరం అందరు తమ తమ స్థానాల్లోనే నిల్చోని.. ఇదే మా నిర్ణయం అంటూ బిగ్‌బాస్‌కు తెలియజేశారు. దీంతో బెస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా సోహైల్‌ని, వరస్ట్‌ ఫెర్మార్మర్‌గా అభిజిత్‌ను ప్రకటించాడు బిగ్‌బాస్‌. అనంతరం ఈ సీజన్‌కి వరస్ట్‌ ఫెర్మార్మర్‌గా ఎన్నికైన అభిజిత్‌..జైలు శిక్ష అనుభవించాలని బిగ్‌బాస్‌ ఆదేశించారు. దీంతో అభిజిత్‌ ఖైదీ దుస్తులు ధరించి జైలుకి వెళ్లాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

22-01-2021
Jan 22, 2021, 14:33 IST
పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నానా హంగామా చేస్తోంది. తల్లి చంకనెక్కిన ఆ పాలబుగ్గల పసిపిల్లాడు ఎవరనుకుంటున్నారు?...
19-01-2021
Jan 19, 2021, 14:45 IST
ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది.. అని అఖిల్‌, సోహైల్‌ ఏనాడో అనుకున్నారు. అందుకే వీళ్లిద్దరిలో ఎవరు బిగ్‌బాస్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నా మిగిలినవాడికి బైక్‌,...
11-01-2021
Jan 11, 2021, 20:25 IST
'నువ్వు గెలిస్తే నాకు ల్యాప్‌టాప్‌, బైక్‌ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా' ఇది ఎక్కడో విన్నట్లుంది...
09-01-2021
Jan 09, 2021, 10:30 IST
అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్‌ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్‌తో ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు వచ్చింది. ‘కథ...
29-12-2020
Dec 29, 2020, 00:00 IST
ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని...
28-12-2020
Dec 28, 2020, 08:50 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజేతగా మిస్టర్‌ కూల్‌ అభిజిత్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఎలాంటి పరిస్థితినైనా డీల్‌ చేయగలిగే నైపుణ్యం, హుందాగా...
27-12-2020
Dec 27, 2020, 11:06 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి...
27-12-2020
Dec 27, 2020, 08:54 IST
హుస్నాబాద్‌: బుల్లితెర వీక్షకులను అలరించిన తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సోహైల్‌కు శనివారం రాత్రి హుస్నాబాద్‌ పట్టణంలో అభిమానులు ఘన...
26-12-2020
Dec 26, 2020, 13:25 IST
మోనాల్‌ గజ్జర్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరు ఇది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ...
23-12-2020
Dec 23, 2020, 16:11 IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లను చూసి జనాలు పెదవి విరిచారు. ముక్కూమొహం తెలీని వాళ్లను హౌస్‌లోకి పంపించారేంటని విమర్శలు గుప్పించారు....
23-12-2020
Dec 23, 2020, 10:39 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్‌...
23-12-2020
Dec 23, 2020, 04:59 IST
బిగ్‌ స్క్రీన్‌లో నటించాలి. బిగ్‌ హౌస్‌లో జీవించాలి. రెండూ తెలిసిన కుర్రాడు అభిజీత్‌. సహజంగానే స్ట్రాంగ్‌. ‘రియాలిటీ’తో.. మరింత స్ట్రాంగ్‌ అయ్యాడు. విజేతగా నిలిచాడు. ‘ఈ...
22-12-2020
Dec 22, 2020, 15:56 IST
అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
22-12-2020
Dec 22, 2020, 14:28 IST
బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్‌ రియాల్టీ రియాలిటీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కు శుభం కార్డు పడింది....
22-12-2020
Dec 22, 2020, 13:39 IST
తెలుగు బుల్లితెరపై 106 రోజులు వినోదాన్ని అందించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 4 డిసెంబర్‌ 20న శుభంకార్డు పడిన విషయం తెలిసిందే....
22-12-2020
Dec 22, 2020, 04:24 IST
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగంలో చేరి ఉంటే అభిజీత్‌ అనే ఒక నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యే వాడే కాదేమో!
21-12-2020
Dec 21, 2020, 11:08 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సేపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ నడుస్తోంది. హౌజ్‌లోనూ, బయట కూడా అతను...
21-12-2020
Dec 21, 2020, 09:16 IST
చిరంజీవి ఎదుట తన మనసులో మాటను సోహైల్‌ బయటపెట్టాడు.
21-12-2020
Dec 21, 2020, 08:32 IST
జీవితంలో మరోసారి బిగ్‌బాస్‌ చూసేది లేదని, కంటెస్టెంట్లకు ఓట్లు వేయమని తెగేసి చెప్తున్నారు.
21-12-2020
Dec 21, 2020, 01:32 IST
సాక్షి, హైదరాబాద్‌: బుల్లితెర వీక్షకులను 106 రోజులపాటు అలరించిన ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌–4 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం ముగిసింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top