మోనాల్ సేఫ్‌, లాస్య ఎగ్జిట్‌!

Bigg Boss 4 Telugu: Anchor Lasya May Get Evicted For 11th Week - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఎలిమినేష‌న్‌లో చోటు చేసుకున్న ట్విస్టులో అంతా ఇంతా కాదు. ఒక‌రు వెళ్లిపోతార‌నుకుంటే మ‌రొక‌రు ఎలిమినేట్ కావ‌డం, అస‌లు ఊహించ‌ని కంటెస్టెంట్లు కూడా హ‌ఠాత్తుగా బ్యాగు స‌ర్దేసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం వంటివి మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలో ప‌ద‌కొండో వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఉత్కంఠ‌గా మారింది. ఈ వారం అభిజిత్‌, అరియానా, సోహైల్‌, మోనాల్‌, హారిక‌, లాస్య నామినేష‌న్‌లో ఉన్నారు. ఈసారి క‌చ్చితంగా మోనాల్ ఎలిమినేట్ అవుతుంద‌ని అన‌ధికారిక పోల్స్ ఘంటాప‌థంగా చెప్పాయి. కానీ వాటిని తూచ్ అంటూ బిగ్‌బాస్ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ట్రోలింగ్‌పై స్పందించిన మెహ‌బూబ్‌)

అందులో భాగంగా యాంక‌ర్ లాస్య‌ను హౌస్‌  నుంచి పంపించేసిన‌ట్లు స‌మాచారం. కాగా నిన్న‌టి ఎపిసోడ్‌లో లాస్య.. గేమ్ ఎలా ఆడుతున్నాన‌ని త‌న భ‌ర్త‌ను ప‌దే ప‌దే అడిగింది. టాస్కుల్లో త‌ను పెట్టిన శ్ర‌మ క‌నిపిస్తుందా? ‌లేదా? అని గుచ్చిగుచ్చి ప్ర‌శ్నించింది. దీనికి ఆమె భర్త సంకోచిస్తూనే అలాంటిదేమీ లేద‌ని, బాగా ఆడుతున్నావ‌ని వెన‌కేసుకొచ్చాడు. కానీ కిచెన్‌లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. కానీ ఆ స‌ల‌హాను ప‌ట్టాలెక్కించేలోపే ఆమె  రేప‌టి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ కానున్న‌ట్లు తెలుస్తోంది. 

బిగ్‌బాస్ షోలో రెండో కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చిన‌ లాస్య మొద‌టి వారంలోనే కెప్టెన్సీను చేజిక్కించుకుంది. త‌ర్వాత సుజాత‌తో క‌లిసి గాసిప్స్ మాట్లాడ‌టం, వంట గ‌దికే ప‌రిమిత‌మ‌వుతూ టాస్కుల్లో వెన‌క‌బ‌డిపోవ‌డంతో ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపుకు తిప్పుకోలేక‌పోయింది. త‌న జీవితంలోని క‌ష్ట‌న‌ష్టాల‌ను గూర్చి చెప్తూ అంద‌రినీ కంట‌త‌డి పెట్టించిన ఆమె చివ‌రికి రేప‌టి ఎపిసోడ్‌లో క‌న్నీటితో బిగ్‌బాస్ షోకు వీడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: నా కూతురే నాకు నటనలో ఓనమాలు నేర్పింది: హారిక త‌ల్లి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

02-12-2020
Dec 02, 2020, 23:19 IST
బిగ్‌బాస్ హౌస్‌లో ఫినాలే రేస్ న‌డుస్తోంది. ఏడుగురితో మొద‌లైన ఈ పోటీ ఇప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య‌నే జ‌ర‌గ‌నుంది. అంద‌రినీ దాటుకుని...
02-12-2020
Dec 02, 2020, 20:51 IST
ఎక్క‌డ చూసినా బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ విజేత ఎవ‌ర‌నేదానిపైనే చ‌ర్చ న‌డుస్తోంది. టాప్ 5లో ఉండేదెవ‌రు? టాప్ 2లో నిలిచేదెవ‌రు?...
02-12-2020
Dec 02, 2020, 17:45 IST
క‌ద‌లిరండి, మీ విలువైన ఓటు హ‌క్కును వినియోగించుకోండి.. అని ప్ర‌భుత్వ యంత్రాంగం, ఎన్నిక‌ల క‌మిష‌న్ నెత్తీనోరూ మొత్తుకుంది. అయినా స‌రే హైద‌రాబాదీలు...
02-12-2020
Dec 02, 2020, 16:40 IST
అమ్మాయిలు ఆకాశంలో స‌గం అంటారు. ఇంటి మహా ల‌క్ష్మి అని కీర్తిస్తారు. అన్ని రంగాల్లో పురుషుల‌తో స‌మానమేన‌ని చెప్తారు. కానీ...
02-12-2020
Dec 02, 2020, 15:40 IST
నామినేష‌న్లు అనే అడ్డంకులే లేకుండా నేరుగా ఫినాలేలో అడుగుపెట్టాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు. అందుకే కంటెస్టెంట్లు బిగ్‌బాస్ ప్ర‌వేశ‌పెట్టిన టికెట్...
01-12-2020
Dec 01, 2020, 23:19 IST
బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌, ఇప్పుడొక లెక్క అన్న‌ట్లుగా త‌మ బుద్ధిబ‌లానికి, శ‌క్తిసామ‌ర్థ్యాల‌కు...
01-12-2020
Dec 01, 2020, 18:35 IST
పంతొమ్మిది కంటెస్టెంట్ల‌తో మొద‌లైన బిగ్‌బాస్ ప్ర‌యాణం ఇప్పుడు ఏడుగురి ద‌గ్గ‌ర ఉంది. వీరిలో ఒక‌రికి నేరుగా ఫినాలేలో పాగా వేసేందుకు...
01-12-2020
Dec 01, 2020, 16:21 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌కు శుభం కార్డు వేసేందుకు ముచ్చ‌ట‌గా మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ స‌మ‌యంలో బిగ్‌బాస్...
01-12-2020
Dec 01, 2020, 15:39 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం తుది అంకానికి చేరుకుంటోంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు మాత్ర‌మే మిగిలారు. వీరిలో ఒక‌రు టాప్ 5లో బెర్త్ క‌న్ఫార్మ్...
30-11-2020
Nov 30, 2020, 23:22 IST
ఈసారి బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌కు కావాల్సిన‌న్ని గొడ‌వ‌లు పెట్టుకునేందుకు బంప‌రాఫ‌ర్ ఇచ్చాడు. ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ మందిని కూడా నామినేట్ చేసుకోవ‌చ్చని...
30-11-2020
Nov 30, 2020, 20:15 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అంద‌రిలో ఆస‌క్తి రేకెత్తించిన ట్ర‌యాంగిల్ స్టోరీ ఎన్నో మ‌లుపులు తిరుగుతూ ఉంది. మోనాల్ కోసం కొట్టుకు...
30-11-2020
Nov 30, 2020, 17:56 IST
ఏ దారి తెలీని నావ‌లా ఎటో వెళ్లిపోతున్న బిగ్‌బాస్ హౌస్‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప‌రిచ‌యం చేశాడు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌....
30-11-2020
Nov 30, 2020, 16:51 IST
బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చాక వంట‌ల‌క్క‌లా మారిన లాస్య ప‌ద‌కొండో వారం ఎలిమినేట్ అయింది. అయితే షో నుంచి వెళ్లిపోతున్నాన‌న్న బాధ...
30-11-2020
Nov 30, 2020, 15:59 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ గ్రాండ్ ఫినాలేకు మ‌రో మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ క్ర‌మంలో కంటెస్టెంట్లు పోటీని...
29-11-2020
Nov 29, 2020, 23:10 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ పన్నెండో వారాంతంలో స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ త‌న మాట‌ల...
29-11-2020
Nov 29, 2020, 18:46 IST
బిగ్‌బాస్ షోలో నిన్న‌టి ఎపిసోడ్ వాడివేడిగా జ‌రిగింది. నాగార్జున పెట్టిన చీవాట్ల‌తో హారిక‌, అభిజిత్ ముఖం మాడిపోయింది. ఎప్పుడూ స‌ర‌దాగా...
29-11-2020
Nov 29, 2020, 16:54 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ట్రోఫీ గెలుచుకునేందుకు ఇంకా మూడు వారాలే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్ప‌టికీ కంటెస్టెంట్లు ఎవ‌రి ఆట వాళ్లు ఆడ‌టం...
29-11-2020
Nov 29, 2020, 15:52 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం ముగింపుకు చేరుతుండ‌టంతో షోకు మ‌రింత వ‌న్నె తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే నేటి ఎపిసోడ్‌లో...
28-11-2020
Nov 28, 2020, 23:46 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం చివ‌రి మ‌జిలీకి చేరుకుంటున్న ద‌శ‌లో కొంద‌రి గ్రాఫ్ త‌గ్గుతోంటే మ‌రికొంద‌రి గ్రాఫ్ పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో...
28-11-2020
Nov 28, 2020, 23:12 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోనే ఈ వారం అత్య‌ధికంగా 9.5 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని నాగ్ స‌గ‌ర్వంగా వెల్ల‌డించారు. అలాగే గుంటూరులో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top