ప‌క్క‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ఉండ‌గా అలా అన‌కు

Bigg Boss 4 Telugu: Amma Rajasekhar Funny Conversation With Sohel - Sakshi

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇంకో ప‌న్నెండు మంది ఉన్నారు. షో అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకునేందుకు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. అయినా స‌రే షోలో మెరుపులు క‌నిపించ‌డం లేదు. ప్రారంభంలో వ‌చ్చిన రేటింగ్స్‌ను బిగ్‌బాస్ కాపాడుకోలేక‌పోతోంది. వారం వారం రేటింగ్స్ దారుణంగా ప‌డిపోతున్నాయి.ప్రారంభంలో వ‌చ్చిన రేటింగ్స్‌ను బిగ్‌బాస్ కాపాడుకోలేక‌పోతోంది. వారం వారం రేటింగ్స్ దారుణంగా ప‌డిపోతున్నాయి. ఇన్నిరోజులు కావ‌స్తున్నా షోలో ఎలాంటి మ్యాజిక్ కానీ ఆస‌క్తిక‌ర అంశాలు కానీ పెద్ద‌గా చోటు చేసుకోవ‌డం లేవు. గొడ‌వ‌లు కూడా అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. ఉన్న‌ద‌ల్లా అవినాష్‌, అఖిల్‌తో మోనాల్ స‌ర‌సాలే ఎక్కువ‌య్యాయి. ఇదిలా వుంటే బిగ్‌బాస్ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న‌ను తాను ఓ ప్రేమికుడులా ఫీల్ అవుతున్నారు. (నువ్వు పెద్ద తోపు, తురుమేం కాదు: అఖిల్‌)

మొద‌ట్లో దివి మార్నింగ్ మ‌స్తీలో ఇంటి స‌భ్యులంద‌రి గురించి త‌న అభిప్రాయాన్ని ఫ‌టాఫ‌ట్ చెప్పింది. అప్ప‌టినుంచి దివికి బ‌య‌టే కాదు, లోప‌ల కూడా ఫాలోయింగ్ పెరిగింది. అలా మాస్ట‌ర్ ఆమెతో జ‌ట్టు క‌ట్టాడు. కాగా నేటి ఎపిసోడ్‌లో ఉద‌యం వ‌చ్చే పాట‌కు మాస్ట‌ర్ రెచ్చిపోయి స్టెప్పులేసిన‌ట్టున్నాడు. ఆ విష‌యాన్ని దివి ప్ర‌స్తావిస్తూ.. పొద్దునే అంత డ్యాన్స్ చేశావేంటి అని అడిగింది. న‌న్ను ఫాలో అయ్యావా మ‌రి అని మాస్ట‌ర్ అడ‌గ్గా 'అక్క‌డ ఫాలో అయ్యేలా ఉందా అస‌లు..' అని దివి చెప్పుకొచ్చింది. అటు సోహైల్ మాత్రం ఈ వ‌య‌సులో కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నాడంటూ ప‌రువు తీశాడు. ఆ త‌ర్వాత దివి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. అప్ప‌టికే తెగ ఫీల‌వుతున్న మాస్ట‌ర్‌.. ప‌క్క‌న‌ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఉంటే అలా ఎందుకురా మాట్లాడుతావ్? అని సోహైల్‌ను వేడుకున్నాడు. దీంతో 'ఇప్ప‌టి నుంచి నిన్ను ఎంతో హైట్ లేపుతాను' అంటూ సోహైల్ మాస్ట‌ర్‌కు మాటిచ్చాడు. (మోనాల్‌కు గోరుముద్ద‌లు తినిపించిన అఖిల్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top