నోయ‌ల్‌కు శాపం పెట్టిన అమ్మ రాజ‌శేఖ‌ర్‌

Bigg Boss 4 Telugu: Amma Rajasekhar Angry On Noel Sean - Sakshi

బిగ్‌బాస్ అనేది రియాలిటీ షో. ఇక్క‌డ నామినేష‌న్ ప్రక్రియ అయినా, గేమ్ అయినా, ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా వాట‌న్నింటినీ ఎదురీదుకుంటూ స్పోర్టివ్‌గా ముందుకెళ్లాలి. కానీ ఇప్పుడున్న 15 మందిలో ఒక్క‌రికి మాత్రం ఈ స్పోర్టివ్‌నెస్ అనేది ఇసుమంతైనా లేదు. అంద‌రూ గురువు, డాడీ అని పిలుచుకుంటూ య‌సుకు పెద్ద‌రికం ఇస్తుంటే అమ్మ రాజ‌శేఖ‌ర్ మాత్రం ఏదో బాబాలా ఫీల్ అయిపోతున్నాడు. అత‌నేం చేసినా క‌రెక్టే కానీ ఇత‌రులు చేస్తే మాత్రం త‌ప్ప‌ని వాదిస్తున్నాడు. పోనీ త‌ప్ప‌ని చెప్తే స‌రిపోతుంది, కానీ అక్క‌డితో ఆగ‌కుండా శాప‌నార్థాలు పెడుతున్నాడు. మొద‌ట సోహైల్ మీద విరుచుకుప‌డ్డాడు. (చ‌ద‌వండి: మాస్ట‌ర్‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్‌)

నిన్న నామినేట్ చేసినందుకు అరియానా మీద ప్ర‌తాపాన్ని చూపించాడు. ఇప్పుడు స్వాతి విషయంలో నామినేట్ చేసినందుకు నోయల్‌పై నోరు పారేసుకున్నాడు. నోయ‌ల్ స్వాతి గురించి చెప్ప‌డం మొద‌లు పెట్ట‌గానే విసుగు ప్ర‌ద‌ర్శించాడు. వేరే ఎవ‌రికైనా చెప్పుకో పో అన్నాడు. అమ్మాయి అయినా, అబ్బాయైనా నేన‌లానే ఉంటాన‌ని నోయ‌ల్ అన‌డంతో చిన్న‌పిల్ల‌ల‌కు చెప్పుకో, ఎందుకు న‌న్ను మ‌ళ్లీ మ‌ళ్లీ చంపేస్తున్నావ్ అని కోప‌గించుకున్నాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ షో నుంచి వైదొలుగుతా: నోయ‌ల్‌)

"నేను ఇంట్లో ఉండ‌కూడ‌దు అని ప్లాన్ చేశావు, నీ కోసం ఈ వారం నేను బ‌య‌ట‌కు వెళ్లాలి, అది నువ్వు జీవితాంతం బాధ‌ప‌డాలి" అని శాప‌నార్థాలు పెట్టాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు మాస్ట‌ర్ ఓవ‌ర్ యాక్టింగ్ నానాటికీ భ‌రించ‌లేనంత‌గా పెరిగిపోతుంద‌ని, అత‌డిని వెంట‌నే పంపించేయాల‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ఎవ‌రైనా త‌న‌ను నామినేట్ చేస్తే చాలు, జ‌న్మ అంతా ఫీల్ అవుతావ్ అని శాపాలు పెట్ట‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ సారి డ‌బుల్ ఎలిమినేష‌న్ పెడితే ఆ సుజాత‌ను, ఈ అమ్మో రాజ‌శేఖ‌ర్‌ను హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించేస్తామ‌ని చెబుతున్నారు. (చ‌ద‌వండి: నేడే ఎలిమినేష‌న్‌: స‌్వాతి దీక్షిత్ అవుట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top