బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి: నోయ‌ల్

Bigg Boss 4 Telugu: Noel Demands Apology From Bigg Boss - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టి 10 రోజుల‌పైనే అయింది. అయినా ఇప్ప‌టికీ ఇంట్లో పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు. ముఖ్యంగా తెలుగు మాట్లాడాలి అన్న నిబంధ‌న‌ను చాలామంది లైట్ తీసుకున్నారు. అయితే కొంద‌రు తెలుగులోనే మాట్లాడినా, స‌గం మంది అన్ని భాష‌ల‌ను క‌లుపుతూ వాగేస్తున్నారు. దీంతో ఇదంతా చూసి చిర్రెత్తిపోయిన‌ బిగ్‌బాస్ అంద‌రికీ క‌లిపి ప‌నిష్మెంట్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో నోయ‌ల్ కాస్త హ‌ర్ట్ అయిన‌ట్లు క‌నిపిస్తున్నాడు. మిగతా ఇంటి స‌భ్యుల‌పై చిర్రుబుర్రులాడుతున్నాడు. అంతేకాదు, బిగ్‌బాస్ మీద కూడా గ‌ర‌మవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ మేర‌కు స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. అందులో "బిగ్‌బాస్ న‌న్ను క్ష‌మించండి, ఇప్ప‌టి నుంచి తెలుగులోనే మాట్లాడ‌తాము" అని బోర్డు మీద రాస్తున్న నోయ‌ల్.. ఒక్క‌సారిగా బిగ్‌బాస్ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌ట్టుప‌ట్టాడు. (ముద్దులు, హ‌గ్గుల‌తో రెచ్చిపోయిన హారిక‌)

ఇంట్లోని ఇత‌ర కంటెస్టెంట్ల‌కు బ‌స్తీ మే స‌వాల్ అని చాలెంజ్ విసురుతున్నాడు. ఈ శ‌నివారం వెళ్లిపోతా అని నిర్ణ‌యించుకున్నానంటున్నాడు. నాగార్జునను ఒప్పించి వెళ్లిపోతానంటున్నాడు. కాగా తెలుగు మాట్లాడ‌కుండా ఉన్న‌ది ప్ర‌ధానంగా మోనాల్‌, అభిజిత్‌, అఖిల్ అయితే మ‌ధ్య‌లో నోయ‌ల్‌కు ఎందుకు శిక్ష విధించార‌ని ఆయ‌న అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. అలా అని మ‌రీ బిగ్‌బాస్ వ‌చ్చి సారీ చెప్పాల‌ని కోర‌డం స‌బ‌బు కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అస‌లు నోయ‌ల్ ఎందుకంత ఫ్ర‌స్టేట్ అవుతున్నాడు? ఇంట్లో ఏం జ‌రిగింద‌నేది తెలియాలంటే ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే. (బిగ్‌బాస్‌: టీఆర్పీలో స‌రికొత్త రికార్డు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top