బిగ్‌బాస్‌: నేడే డైరెక్ట్ ఎలిమినేష‌న్‌

Bigg Boss 4 Telugu: Swathi Dixit Going To Eliminate - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ నాలుగో వారంలో ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్ర‌తిసారి ఆదివారం ఎలిమినేష‌న్ ఉంటే ఈ సారి మాత్రం శ‌నివారం నాడే హౌస్‌లో నుంచి ఒక‌రిని బ‌య‌ట‌కు పంపించేస్తున్నారు. ఈసారి ఒక్కొక్క‌రినీ సేఫ్ అంటూ ఊరించ‌డాలు ఏమీ లేవు. నేరుగా ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌న చేప‌ట్టారు. అందులో భాగంగా నామినేష‌న్‌లో ఉన్న కంటెస్టెంట్లు చేత ప‌ట్టుకున్న తుపాకీతో త‌ల‌కు గురి పెట్టుకున్నారు. వీరిలో ఎవ‌రి గ‌న్ పేలిన శ‌బ్ధం వ‌స్తుందో వాళ్లే ఎలిమినేట్ అయిన‌ట్లు లెక్క‌. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్ర‌కారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంటును ఇంటిస‌భ్యులంద‌రూ క‌లిసి ద‌గ్గ‌రుండి మ‌రీ వీడ్కోలు చెప్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: రీ ఎంట్రీపై స్పందించిన‌ దేవి)

ఇక ప్రోమోలో బిగ్‌బాస్ ఇంట్లోకి ప్ర‌వేశించే ద్వారం ద‌గ్గ‌ర మోనాల్‌, హారిక‌, లాస్య‌, సుజాత‌, దివి, అరియానా, గంగ‌వ్వ ఉన్నారు. కానీ స్వాతి దీక్షిత్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అలాగే సోష‌ల్ మీడియాలోనూ స్వాతి ఎలిమినేట్ అయ్యిందంటూ లీకువీరులు దండోరా వేస్తున్నారు. నేటి ఎపిసోడ్‌లోనూ అదే నిజ‌మ‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఎలిమినేష‌న్ ఒక‌రోజు ముందే జ‌ర‌గ‌డం కొత్త అనుమానాల‌కు తావిస్తోంది. స్వాతిని బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చినా ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తారో, లేదా ఆమె చేత వేరొకరు ఎలిమినేట్ అయ్యార‌ని చెప్పిస్తారో, అస‌లేం చేయ‌నున్నార‌నేది అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది. ఏదేమైనా స్వాతిని హౌస్‌లోకి తీసుకువ‌చ్చిన‌ ఒక్క‌వారానికే పంపించేస్తారా అని నెటిజ‌న్లు బిగ్‌బాస్‌ను నిల‌దీస్తున్నారు. ఈ మాత్రం దానికి ఆమెను ఎందుకు తీసుకొచ్చార‌ని విమ‌ర్శిస్తున్నారు.  (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: స్వాతి దీక్షిత్ త‌ప్పు చేస్తోందా?)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top