అఖిల్ ఇంకేదో ఆశించాడు, అందుకే..: మోనాల్‌ | Bigg Boss 4 Telugu: Akhil Expecting More From Me Says Monal Gajjar | Sakshi
Sakshi News home page

అఖిల్‌-మోనాల్ గొడ‌వ‌‌: అగ్నికి ఆజ్యం పోస్తున్న మాస్ట‌ర్‌?

Nov 3 2020 3:40 PM | Updated on Nov 4 2020 12:33 PM

Bigg Boss 4 Telugu: Akhil Expecting More From Me Says Monal Gajjar - Sakshi

అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ కాలేరు. ఇంకా మోర్‌ కావాలి...

నోయ‌ల్ అగ్గిపుల్ల వెలిగిస్తే అది బిగ్‌బాస్‌ హౌస్‌లో కార్చిచ్చుగా మారింది. తొలిసారి నామినేష‌న్‌లో ఫేక్ న‌వ్వుల‌ను ప‌క్క‌న‌పెట్టి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేలా కార‌ణాలు చెప్తూ నామినేట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అభిజిత్‌ అవినాష్‌ను నామినేట్ చేయ‌గా త‌ర్వాతి టార్గెట్ అమ్మ రాజ‌శేఖ‌ర్ అని గ‌త‌ ప్రోమోను చూస్తేనే తెలుస్తోంది. అఖిల్ కూడా అభి బాట‌లోనే వెళ్ల‌నున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అఖిల్ మాట్లాడుతూ.. "ఇంట్లో ఉండ‌టానికి అర్హ‌త ఉండాలి. పోతా పోతా అని మీరే ప‌దిసార్లు అంటుంటారు. కాబ‌ట్టి వెళ్ల‌డానికి మీరు రెడీ అయితే పంపించ‌డానికి కూడా నేను రెడీనే" అని మాస్ట‌ర్ త‌ల‌పై గుడ్డు ప‌గ‌లగొట్టాడు. త‌ర్వాత త‌న క్లోజ్ ఫ్రెండ్ అయిన మోనాల్‌ను నామినేట్ చేయ‌డం ఇంటిస‌భ్యుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను సైతం షాక్‌కు గురి చేసింది. అయితే అఖిల్ ఆమెను నామినేట్ చేయ‌డం ఇదే తొలిసారి కాదు. ఏడో వారంలో కూడా "బాగా ఆడేవాళ్లే హౌస్‌లో ఉండాలి, నేను నీ క‌న్నా బాగా ఆడ‌తాను" అంటూ మోనాల్‌ను నామినేట్ చేశాడు. అప్పుడు మోనాల్ పెద్ద‌గా ఫీల్ అవ్వ‌లేదు. కానీ ఇప్పుడు మాత్రం త‌ట్టుకోలేక‌తోంది. 

(తెరపైకి ‘చిల్లర కామెడీ’.. అభి తలపై కోడి గుడ్ల మోత)

కాసేపు మాట్లాడ‌క‌పోయే స‌రికే నా అఖిల్ ఇలా ఉండ‌డు అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. అలాంటిది ఏకంగా నామినేట్ చేయ‌డంతో ఆమెకు ఏడుపు క‌ట్ట‌లు తెంచుకుంది. ఇది చూసిన మాస్ట‌ర్‌ 'వాడేంటి మిగ‌తా ఫ్రెండ్స్‌ను ప‌క్క‌న‌పెట్టి నీమీద వేశాడు' అని అగ్నికి ఆజ్యం పోస్తూ మాట్లాడాడు. దానికి మోనాల్ రిప్లై ఇస్తూ.. అమ్మాయి-అబ్బాయి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాలేరు.. కొంచెం మోర్ కావాలి?? ఆ మోర్‌ అఖిల్‌కు ఇవ్వ‌లేదు క‌దా! అదే ప్రాబ్లమ్' అని చెప్పుకొచ్చింది. ఆమె ప‌రిస్థితిని చూసి జాలిప‌డ్డ మాస్ట‌ర్ 'నువ్వు ఉండే వ‌ర‌కూ నేను నీకు స‌పోర్ట్‌గా ఉంటా 'అని మోనాల్ చేయి ప‌ట్టుకుని ధైర్యం చెప్పాడు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో అవినాష్‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, మోనాల్ ఒక టీమ్‌గా ఏర్ప‌డిన‌ట్లు ప్రోమోలో చూపించారు. కాగా సోహైల్ త‌న గురించి వెన‌కాల‌ ఏదో మాట్లాడుతున్నట్టు అబ‌ద్ధం చెప్పినందుకే అఖిల్ మోనాల్‌ను నామినేట్ చేశాడా? లేదా వేరే ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement