'కథ వేరేలా ఉందే'.. అనిల్‌ రావిపూడిని కలిసిన సోహైల్‌

Bigboss Fame Sohel Meets Director Anil Ravipudi - Sakshi

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్‌-4తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో సయ్యద్‌ సోహైల్‌ ముందుంటాడు. హౌజ్‌లో‌ ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. 100 రోజుల పాటు హౌస్‌లో సందడి చేసిన సోహైల్ ఈ సీజన్‌లో‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు బిగ్‌బాస్‌తో విపరీతంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్‌ లైఫ్‌ టర్న్‌ అయ్యిందని చెప్పవచ్చు. రీసెంట్‌గా సోహైల్‌ .. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడిని కలిశాడు.

ఈ సందర్భంగా ఇద్దరం కలిసి బిగ్‌బాస్‌ రోజుల్ని గుర్తుతెచ్చుకున్నామని తెలిపాడు. జీరో యాటిట్యూడ్, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడిని కలిసే అవకాశం వచ్చిందని, అయితే ఇది జస్ట్‌ క్యాజువల్‌​ మీటింగ్‌ మాత్రమేనని, సినిమాకు సంబంధించింది కాదని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి ఇచ్చిన సలహాలు, సూచనల్ని తప్పకుండా పాటిస్తానని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్‌ చేశాడు. బిగ్‌బాస్‌ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్‌.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్‌ రెడ్డి’, ‘ప్రెషర్‌ కుక్కర్‌’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్‌ స్నేహితుడు శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. 

చదవండి : బిగ్‌బాస్‌ ఫేం సొహైల్‌కు రైజింగ్‌ స్టార్‌ అవార్డు
దూసుకెళ్తున్న ‘హీరో’..అప్పుడే 4M వ్యూస్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top