Amala Paul: సింగర్‌తో అమలాపాల్ రెండో పెళ్లి? బెయిల్ పిటిషన్‌లో ఏముందంటే?

హీరోయిన్ అమలాపాల్ తన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్‌పై పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే! భవీందర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా అతడు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 2017లోనే అమలాపాల్‌తో తన పెళ్లి జరిగిందని తెలియజేస్తూ అందుకు సంబంధించిన సాక్ష్యాలను దానికి అటాచ్ చేశాడు. వాటిని పరిశీలించిన అనంతరం న్యాయస్థానం అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కోర్టు వ్యవహారం నేపథ్యంలో మరోసారి వీరి పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా అమలాపాల్ 2014లో దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావడంతో 2017లో విడిపోయారు. అనంతరం ఆమె తన నివాసాన్ని పుదుచ్చేరికి షిఫ్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె సింగర్ భవీందర్ సింగ్‌తో లవ్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. 2020లో అమలాపాల్- భవీందర్ సింగ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వారు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారని అంతా భావించారు. కానీ అది కేవలం ఫొటోషూట్ మాత్రమేనని అమలాపాల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు.
చదవండి: చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యా: యాంకర్
రామ్‌చరణ్ మేకప్ ఆర్టిస్ట్‌తో బాలీవుడ్ నటుడి పెళ్లి
సంబంధిత వార్తలు