Arohi Rao: చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యా, కూలీపనులకు వెళ్లేదాన్ని

Bigg Boss Telugu 6: Arohi Rao about Her Personal Life - Sakshi

ఐదేళ్ల వయసులోనే అమ్మ చనిపోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగింది యాంకర్‌ ఆరోహి. చిన్నతనంలోనే కూలీపనులు చేసుకుంటూ చదివింది. యాక్టింగ్‌ అంటే ఇష్టంతో హైదరాబాద్‌ వచ్చి షార్ట్‌ ఫిలింస్‌లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుని ఓ మీడియాలో యాంకర్‌గా పని చేస్తోంది. తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే ఆమె బిగ్‌బాస్‌కు వెళ్లేముందు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

'ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. అప్పటినుంచి ఆయన టచ్‌లో లేడు. నేను, అన్నయ్య మా అమ్మమ్మ దగ్గరే పెరిగాం. నాకు లవ్‌ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. పెళ్లిదాకా వెళ్లింది, కానీ ఆగిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా చదువును మధ్యలో ఆపేశా. మొదట్లో వరంగల్‌లో లోకల్‌ ఛానల్‌లో పని చేసేదాన్ని. అప్పుడు నెలకు నాలుగువేల జీతం ఇచ్చారు. ఫస్ట్‌ డబ్బింగ్‌ చెప్పినప్పుడు రూ.200 ఇస్తే చాలా సంతోషించాను. హైదరాబాద్‌ వచ్చాక ఓ ఛానల్‌లో యాంకర్‌గా స్థిరపడ్డా. ఈ మూడేళ్ల నుంచే కాస్త ప్రశాంతంగా ఉంటున్నా. కానీ ఈ మూడేళ్ల కంటే ముందు ప్రతిరోజు రాత్రి ఏడ్చేదాన్ని. రేపు ఎలా? అని ఆలోచన వచ్చినప్పుడల్లా ఏడవని రోజంటూ లేదు.

ఒకసారేమైందంటే.. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇద్దరు అబ్బాయిలు నన్ను ఫాలో అయ్యారు. ఏం కావాలి? అన్న అని అడిగితే నవ్వి ఊరుకున్నారు. మళ్లీ ఫాలో అయితే వెంటనే బండిని ఒక్క తన్ను తన్నాను. అది ఒకడి కాలు మీద పడింది. వాళ్లు పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చి పిలిపించారు. కాలు విరిగిపోవాల్సింది, ఇంకా ఏం కాలేదు, సంతోషించమని చెప్పాను' అంటూ ఆ సంఘటనను గుర్తు చేసుకుంది ఆరోహి.

చదవండి: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న లవ్‌బర్డ్స్‌
నన్ను బద్నాం చేయకు.. రేవంత్‌పై భగ్గుమన్న యాంకర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top