Bigg Boss Telugu 6: Big Revelation About Marina, Rohit | Bigg Boss 6 Telugu Episode 4 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: నన్ను బద్నాం చేయకు, రేవంత్‌పై ఒంటికాలిపై లేచిన యాంకర్‌

Sep 7 2022 11:48 PM | Updated on Sep 8 2022 9:18 AM

Bigg Boss Telugu 6: Big Revelation About Marina, Rohit - Sakshi

తాను నిద్రపోయినప్పుడు కిచకిచమంటూ సూర్యతో ముచ్చట్లు పెడుతూ తన నిద్ర డిస్టర్బ్‌ చేసిందని ఆరోహిపై ఆరోపణలు గుప్పించాడు. దీనికి ఆ యాంకర్‌ స్పందిస్తూ.. ఆరోజు మీ నిద్ర డిస్టర్బ్‌ చేసినందుకు మీదగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పానని, అనవసరంగా నన్ను బద్నాం చేయకండి అని గట్టిగానే కౌంటరిచ్చింది.

ఏదైనా కొత్తదనం చూపించాలనుకున్నాడో మరేంటో కానీ బిగ్‌బాస్‌ ఈసారి నామినేషన్స్‌ను ఏకంగా సోమవారం నుంచి బుధవారానికి మార్చేశాడు. మరి ఈ మూడు రోజుల్లో కంటెస్టెంట్లకు ఏమాత్రం ఓట్లు పడతాయో తెలీదు కానీ కచ్చితంగా లేడీ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అయ్యేట్లు కనిపిస్తోంది. ఇంతకీ లేడీ కంటెస్టెంటే ఎందుకు ఎలిమినేట్‌ అవుతుంది? అసలు ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు? అనేది బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోని నాలుగో ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేయండి..

బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు ఇచ్చిన క్లాస్‌.. మాస్‌.. ట్రాష్‌ నిన్నటితోనే ముగిసింది. ట్రాష్‌లో ఉన్న ఆదిత్య, ఇనయ, అభినయ శ్రీ నేరుగా నామినేట్‌ అయ్యారు. క్లాస్‌ టీమ్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా ఈవారం నామినేషన్‌ నుంచి సేఫ్‌ అయ్యారు. మాస్‌ టీమ్‌లో ఉన్న మిగతా సభ్యులు నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే ఇక్కడే బిగ్‌బాస్‌ ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. జంటగా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్‌ జంటగానే నామినేషన్‌లోకి వెళ్తారని, ఒకవేళ ఎలిమినేట్‌ అయినా ఇద్దరూ కలిసే బయటకు వెళ్తారని స్పష్టం చేశాడు. గతంలో వరుణ్‌-వితిక దంపతులు హౌస్‌లో అడుగుపెట్టినా ఎవరి ఆట వారే ఆడుకున్నారు, ఎవరి నామినేషన్‌ వారే చేసుకున్నారు. బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు విడివిడిగానే వెళ్లిపోయారు. మరి ఈసారి ఎంట్రీ ఇచ్చిన కపుల్‌కు బిగ్‌బాస్‌ ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చాడంటే ఈ సీజన్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఉండేట్లు కనిపిస్తోంది.

ఇకపోతే బిగ్‌బాస్‌ షోలో మొదటి నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. వేస్ట్‌ కంటెస్టెంట్లు అనుకునేవాళ్ల పేర్లను పేపర్‌పై స్టాంప్‌ చేసి, దాన్ని ఫ్లష్‌ చేయాలన్నాడు బిగ్‌బాస్‌. మొదటగా రేవంత్‌ మాట్లాడుతూ.. పని చేయడానికి ముందుకు రావట్లేదంటూ ఫైమా, ఆరోహి రావులను నామినేట్‌ చేశాడు. తాను నిద్రపోయినప్పుడు కిచకిచమంటూ సూర్యతో ముచ్చట్లు పెడుతూ తన నిద్ర డిస్టర్బ్‌ చేసిందని ఆరోహిపై ఆరోపణలు గుప్పించాడు. దీనికి ఆ యాంకర్‌ స్పందిస్తూ.. ఆరోజు మీ నిద్ర డిస్టర్బ్‌ చేసినందుకు మీదగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పానని, అనవసరంగా నన్ను బద్నాం చేయకండి అని గట్టిగానే కౌంటరిచ్చింది.

కీర్తి భట్‌ మాట్లాడుతూ.. తనకు, శ్రీహాన్‌కు మధ్య ఉన్న బంధంపై రేవంత్‌ జోక్‌ చేశాడని, దీంతో శ్రీహాన్‌ను చోటు భయ్యా అని పిలవాల్సి వచ్చిందని చెప్పింది. తనలా చేయడం వల్ల శ్రీహాన్‌ సరిగా మాట్లాడటమే మానేశాడని వాపోయింది. మరోవైపు పనుల్లో ఇన్వాల్వ్‌మెంట్‌ లేదని చంటిని నామినేట్‌ చేసింది. తర్వాత ఆరోహి వంతు రాగా అత్యుత్సాహంతో మీకు తెలీకుండానే అందరినీ హర్ట్‌ చేస్తున్నావంటూ రేవంత్‌ను, నేను ప్రేమగా శ్రీసత్య అని చాలాసార్లు పిలిచాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదంటూ శ్రీసత్యను నామినేట్‌ చేసింది.

శ్రీసత్య వంతు వచ్చేసరికి.. నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనుషులతో మాట్లాడటం మానేశా. అందులోనూ కొత్తవాళ్లతో మాట్లాడటానికి టైం పడుతుంది. ముఖ్యంగా తనకు యాటిట్యూడ్‌ లేదని స్పష్టం చేస్తూ వాసంతి, రాజశేఖర్‌ను నామినేట్‌ చేసింది. అనంతరం సుదీప.. రేవంత్‌, చంటిని; ఫైమా.. రేవంత్‌, అర్జున్‌లను; అర్జున్‌.. ఫైమా, ఆరోహిలను; రాజశేఖర్‌.. వాసంతి, శ్రీ సత్యలను; షాని.. శ్రీసత్య, చంటిని; శ్రీహాన్‌.. రేవంత్‌, కీర్తిని; సూర్య.. రేవంత్‌, చంటిని; చంటి.. రేవంత్‌, సుదీపను; వాసంతి.. రేవంత్‌ను, యాటిట్యూడ్‌ చూపిస్తుందని శ్రీ సత్యను నామినేట్‌ చేసింది. మెరీనా- రోహిత్‌ దంపతులు.. ఫైమా, చంటిని నామినేట్‌ చేశారు.

అనంతరం మెరీనా మాట్లాడుతూ.. నేను కిచెన్‌లో వంట చేస్తున్నప్పుడు ఆరోహి.. నేను మెరీనా కన్నా తక్కువ సైజ్‌ అని ఎవరితోనో చెప్పింది. నాకు బాడీ షేమింగ్‌ నచ్చదంటూ ఎమోషనలైంది. అయితే అసలు తను ఆ మాట అనలేదని ఆరోహి బలంగా చెప్పినప్పటికీ మెరీనా వినిపించుకోలేదు. నామినేషన్‌ ప్రక్రియ ముగిసేసరికి అందరికన్నా అత్యధికంగా రేవంత్‌కు 8 ఓట్లు పడటం గమనార్హం. నామినేషన్స్‌ తంతు ముగిసిందనుకునే సమయానికి చివర్లో బిగ్‌బాస్‌ ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. ట్రాష్‌లోని సభ్యులొకరు మాస్‌ టీమ్‌ మెంబర్‌తో స్వాప్‌ అవ్వొచ్చని చెప్పాడు. దీంతో బాలాదిత్యను సేఫ్‌ చేసి ఆ స్థానంలోకి ఆరోహిని పంపించారు. ఫైనల్‌గా మొదటి వారం రేవంత్‌, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనయ, ఆరోహి, అభినయశ్రీ ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్‌ అయ్యారు.

చదవండి: బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు ఒప్పుకోలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement