నాన్న ఆశీస్సులు మాకుంటాయి: ఎ. ప్రదీప్‌ | Bhala Chora Bhala Movie Gets Release Date | Sakshi
Sakshi News home page

నాన్న ఆశీస్సులు మాకుంటాయి: ఎ. ప్రదీప్‌

Aug 14 2022 8:05 AM | Updated on Aug 14 2022 8:06 AM

Bhala Chora Bhala Movie Gets Release Date - Sakshi

ఖయ్యుమ్, నవీన్‌ నేని, రోయిల్‌ శ్రీ,చింటు, శాంతి దేవగుడి, రామ్‌ జగన్, చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో నటింన చిత్రం ‘భళా చోర భళా’. దివంగత నటుడు ఏవీఎస్‌ తనయుడు ఎ. ప్రదీప్‌ దర్శకత్వం    వహించారు. యాక్టివ్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఎ. జనని ప్రదీప్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు  ప్రకటించి, ట్రైలర్‌ను విడుదల చేశారు. ఖయ్యుమ్‌ మాట్లాడుతూ– ‘‘ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రదీప్, నాకు మధ్య మం స్నేహం ఉంది’’ అన్నారు.

‘‘మా నాన్న ఏవీఎస్‌గారిపై ఉన్న అభిమానంతో ఎంతోమంది నాకు సపోర్ట్‌ చేశారు. నాన్న లేకపోయినా మాకు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 26న మా అమ్మగారి పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు ప్రదీప్‌. ‘‘ఈ సినిమాలో నెగటివ్‌ రోల్‌ చేశాను’’ అన్నారు ‘అవును’ ఫేమ్‌ చంటి. ఈ చిత్రానికి కెమెరా: లక్ష్మణ్, సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్‌ అద్దంకి.

Advertisement
 
Advertisement
Advertisement