యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

Published Mon, Jan 1 2024 1:13 AM

Bellamkonda Sai Srinivas BSS 10 shooting schedule complete - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బీఎస్‌ఎస్‌ 10’(వర్కింగ్‌ టైటిల్‌). ‘భీమ్లా నాయక్‌’ మూవీ తర్వాత సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా కీలక షెడ్యూల్‌ పూర్తయింది. ‘‘యూనిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘బీఎస్‌ఎస్‌ 10’.  భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌ని గతంలో ఎన్నడూ చూడని పవర్‌ ఫుల్‌ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు సాగర్‌ కె.చంద్ర. ఈ సినిమాలోని కీలకమైన షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 3న శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ్ర΄÷డ్యూసర్‌: హరీష్‌ కట్టా, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: ముఖేష్‌ జ్ఞానేష్‌. 

Advertisement
 
Advertisement