బంగార్రాజు చిత్రం నుంచి మరో లిరికల్‌.. 'నా కోసం నువ్వు' అంటూ | Bangarraju Movie Another Lyrical Song Released | Sakshi
Sakshi News home page

Bangarraju Movie: బంగార్రాజు చిత్రం నుంచి మరో లిరికల్‌.. 'నా కోసం నువ్వు' అంటూ

Dec 5 2021 7:22 PM | Updated on Dec 5 2021 7:25 PM

Bangarraju Movie Another Lyrical Song Released - Sakshi

Bangarraju Movie Another Lyrical Song Released: టాలీవుడ్‌ మన్మథుడు, కింగ్ నాగార్జున సినీ కెరీర్‌లో మంచి విజయాన్ని సాధించిన సినిమాల్లో ఒకటి 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపించి అలరించారు. ఈ సినిమాకు 'బంగార్రాజు' పేరుతో ప్రీక్వేల్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా కల్యాణ్‌ కృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అందమైన మెలోడీ పాటను విడుదల చేశారు మేకర్స్‌. 'నా కోసం నువ్వు' అంటూ సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యం అందించగా, ప్రముఖ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. పాటలో అనూప్  రూబెన్స్‌ సంగీతం అద్భుతంగా ఉంది. 

ఈ లిరికల్‌ వీడియో చివరిలో నాగర్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ పాట టీజర్‌ను డిసెంబర్‌ 2న విడుదల చేయగా పూర్తి సాంగ్‌ను ఇవాళ (డిసెంబర్‌ 5) న రీలీజ్‌ చేశారు. ఇంతకుముందు 'నాగలక్ష్మీ' పాత్రలో కనిపించిన కృతి శెట్టి లుక్‌కు మంచి ఆదరణ లభించింది. అలాగే నాగార్జున పాడిన 'లడ్డుండా' లిరికల్‌ పాటకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 'బంగర్రాజు' సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, చై సరసన కృతి శెట్టి కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్డూడియోస్‌, అన్నపూర్ణ స్డూడియోస్‌ సంయుక్తంగా నిర‍్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఇదీ చదవండి:  నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్‌ చేయలేరు నాన్నా.. చైతూ ట్వీట్‌ వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement