Bangarraju: నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు నాన్నా.. చైతూ ట్వీట్ వైరల్

‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున– దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘లడ్డుండా’అనే లిరికల్ సాంగ్‌ని మంగళవారం నాగార్జున విడుదల చేశాడు.
(చదవండి: విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్ క్రేజ్.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు)
భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించిన ఈ పాటని ధనుంజయ, మోహన బోగరాజు, హరిప్రియ, నూతన్ మోహన్ అద్భుతంగా ఆలపించారు. 'బాబూ.. తబలా.. అబ్బాయ్ ఆర్మనీ.. చెరుకు తోటలో చారెడు బియ్యం.. వంగ తోటలో మరదలి కయ్యం.. లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా' అంటూ పాటకు ముందు వచ్చే సాకీకి నాగార్జున గళం తోడు కావడంతో పాట అదిరిపోయింది.
ఇక ఈ పాటకు సంబంధించిన యూట్యూబ్ లింక్‌ని తన ట్విటర్ ఖాతలో పోస్ట్ చేసిన నాగచైతన్య.. ‘నాన్నా.. నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు’కామెంట్ చేశాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Nana no one can match your swag !
Here’s the first lyrical #Laddunda from #Bangarraju https://t.co/xdqepkq4S9@iamnagarjuna @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_@lemonsprasad @zeemusiccompany— chaitanya akkineni (@chay_akkineni) November 9, 2021