Baby Movie: Vaishnavi Chaitanya About Viraj Ashwin Liplock Scene - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: ఆ సీన్లు ఇంట్లో వాళ్లతో కలిసి చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే: వైష్ణవి

Jul 17 2023 8:03 AM | Updated on Jul 17 2023 8:47 AM

Baby Movie Vaishnavi Chaitanya About Viraj Liplock Scene - Sakshi

ఆనంద్‌ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌,  ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా జులై 14న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. మొదట్లో టిక్‌టాక్‌, యూట్యూబ్‌ వీడియోలతో జర్ని ప్రారంభంచి వెండితెరపైన మెరిసింది. ఈ సినిమా వల్ల హీరోయిన్‌ వైష్ణవికి మంచి గుర్తింపు దక్కింది. తను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్‌ సీన్ల గురించి మాట్లాడింది.

(ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్‌ హిట్‌ డైరెక్టర్‌)

ఎక్కడో ఓ బస్తీ నుంచి  టిక్‌టాక్‌ వీడియోలు చేసుకొంటూ ఇంత దూరం వచ్చానని వైష్ణవి చెప్పింది. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నిలబడగలననే ధైర్యం నాగతం నాకు ఇచ్చేసింది. ఎందుకంటే ఈ ప్రయాణానికి ఎనిమిదేళ్లు పట్టింది. దీంతో ఎన్నో ఇబ్బందులు కూడా చూశానని చెప్పింది. నిజానికి హీరోయిన్‌ అవ్వాలనో, ఏదేదో చేసేయాలనో తనకు లేదని,  సినిమాల్లోకి రావాలి, స్థిరపడాలి.. అంతే తన ఆశ అంటూ పేర్కొంది. కానీ బేబీ అంతకు మించి గుర్తింపు ఇచ్చిందని తెలిపింది.

బోల్డ్‌ సీన్స్‌ గురించి
'ఒక సినిమాలో రొమాన్స్‌, లిప్‌లాక్‌ సీన్లలో నటించడం చాలా కష్టం. కానీ నా అదృష్టం  ఏమిటంటే బేబీ టీమ్‌ నన్ను కంఫర్ట్‌గా చూసుకున్నారు. ఆ సీన్‌ చేసే రోజు సెట్లో  చాలా తక్కువ మంది ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఆ రోజు విరాజ్‌ అశ్విన్‌ కూడా ఇలా అన్నాడు 'సినిమా కోసం ఇంత వరకూ చాలా సీన్లు చేశాం. ఇది కూడా అలాంటిదే అనుకో అన్నాడు. అంతేకాకుండా ఇదీ జస్ట్‌.. మనం నటిస్తున్నామంతే' అంటూ ధైర్యాన్ని నింపాడు. ఆ సమయంలో నేనూ కూడా సన్నివేశంలో భాగంగానే చూశాను. సినిమా చూశాక ఇంట్లో వాళ్లూ కూడా అలాగే ఆలోచించారు. కానీ సినిమాను పూర్తిగా చూసిన తర్వాత ఆ లిప్‌లాక్‌, బోల్డ్‌ సీన్స్‌ గుర్తుండవు. ఇందులో అంతకు మించిన భావోద్వేగాలు చాలా ఉన్నాయి. 'అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: 'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్‌ థైస్‌ చూసేందుకు కారులో వెళ్లాం')

Advertisement
 
Advertisement
Advertisement