లుక్‌ కోసం ప్లాస్టిక్‌ సర్జరీ.. అవికా గోర్‌ ఏమన్నారంటే..? | Avika Gor Clarity About Plastic Surgery Rumors | Sakshi
Sakshi News home page

లుక్‌ కోసం ట్రీట్మెంట్‌.. అవికా గోర్‌ ఏమన్నారంటే..?

May 24 2026 4:28 PM | Updated on May 24 2026 4:40 PM

Avika Gor Clarity About Plastic Surgery Rumors

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ అందుకున్న నటి అవికా గోర్‌. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ..తొలి చిత్రంతోనే భారీ హిట్‌ని అందుకుంది. ఆ తర్వాత ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గతేడాదిలో పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ తెలుగు ఆడియన్స్‌ అవికాను ఇంకా ‘చిన్నారి పెళ్లికూతురు’గానే చూస్తారు. తాజాగా ఈ బ్యూటీ ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అందమైన లుక్‌ కోసం  ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందనే పుకార్లపై స్పందించింది. లుక్‌ కోసం తాను ఎలాంటి ట్రీట్మెంట్‌ తీసుకోలేదని స్పష్టం చేసింది.

మొటిమల కోసం ట్రీట్మెంట్‌ తీసుకున్నా
లుక్‌ కోసం నేనెప్పుడు ట్రీట్మెంట్‌ తీసుకోలేదు. నా జీవితంలో ఒకే ఒక్కసారి మెడికల్‌ ట్రీట్మెంట్‌ తీసుకున్నా. అది కూడా మొటిమలు పోగోట్టుకోవడానికి. టీనేజ్‌లో నా ముఖంపై చాలా మొటిమలు ఉండేవి. వాటిని తొలగించుకునేందుకు మెడికల్‌ ట్రీట్మెంట్‌ తీసుకున్నా. అది కూడా సరిగా వర్కౌట్‌ అవ్వలేదు(నవ్వుతూ). ఇప్పటికీ నా ముఖంపై మొటిమలు ఉన్నాయి. సర్జరీలు ఏం చేసుకోలేదు కానీ..స్కీన్‌ పాడవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా. నేనే కాదు ప్రతి ఒక్క నటీనటులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. నేను 7 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చా. చిన్నప్పటి నుంచే మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. అందుకే సన్‌స్క్రీన్‌ ఎక్కువగా వాడేదాన్ని.

అమ్మ తిట్టేది.. 
లుక్‌ కోసం ట్రీట్మెంట్‌ కాదు..కనీసం నా హెయిర్‌ కట్‌ చేసుకుంటా అని చెప్పిన అమ్మ తిట్టేది. ఇక టాటూ వేసుకుంటా అన్నప్పుడు అయితే పెద్ద గొడవే జరిగింది. అలాంటిది నేను లుక్‌ కోసం ట్రీట్మెంట్‌ ఎలా తీసుకుంటా? వయసు పెరిగేకొద్ది మన ముఖంలో మార్పులు వస్తాయి. నేను చిన్నప్పటి నుంచే అందరికి తెలియడంతో పెద్దయ్యాక నా ముఖంలో వచ్చిన మార్పులు చూసి సర్జరీ చేయించుకుందనే పుకార్లను సృష్టించారు. అంతేకాదు నేను బరువు పెరిగి తగ్గడం వల్ల కూడా ఇలాంటి పుకార్లకు కారణం అయింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు’ అని అవికా స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement