Athiya Shetty - KL Rahul wedding: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. ప్రముఖులకు అందని ఆహ్వానం

Athiya Shetty and KL Rahul wedding 100 attendees from both sides - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్ మరి కొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్నారు. ముంబయిలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్ జహాన్‌ ఈ వేడుకకు సిద్ధమైంది. ఈ ప్రేమజంట వివాహానికి హాజరయ్యే అతిథులకు ఆహ్వానాలు అందించారు. పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరలయ్యాయి. 

అతియా శెట్టి-కేఎల్ రాహుల్ వివాహ వేడుక వివరాలు

అతియా శెట్టి, కేఎల్ రాహుల్ జనవరి 23న ఇరు కుటుంబాల తరఫున కేవలం 100 మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులకే ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులను పిలవలేదని సమాచారం. అయితే పెళ్లి అయిన కొన్ని వారాల తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ జరుగునుంది. ఈ కార్యక్రమాన్ని మే నెలలో ఐపీఎల్ ముగిసిన  సినీ, క్రికెట్ ప్రముఖుల కోసం భారీ వేడుకను ప్లాన్ చేసినట్లు సన్నిహితులు తెలిపారు.

పెళ్లిలో నో ఫోన్:  ఇటీవల సెలబ్రిటీల పెళ్లిళ్లలో ‘నో ఫోన్ పాలసీ’ లేటెస్ట్ ట్రెండ్‌గా మారింది. తాజాగా అతియా శెట్టి, కేఎల్ రాహుల్‌ పెళ్లిలో కూడా అతిథులకు ఫోన్లు తీసుకు రావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. వివాహ వేడుకకు సంబంధించి ఎటువంటి చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేయవద్దని కూడా వారికి సూచించారు. ఈ పెళ్లికి అతియా స్నేహితులు, ఆమె సోదరుడు అహన్ శెట్టి, తల్లిదండ్రులు సునీల్, మనా శెట్టి సంగీత వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ పెళ్లిలో స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే భాగం కానున్నారు. మూడేళ్లుగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న జంట ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్‌గా సోషల్ మీడియాలో ప్రకటించారు. తాజాగా వివాహబంధంతో ఒక్కటి కానుంది ఈ జంట. 

 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top