Ashu Reddy Birthday Gift By Her Father That Mercedes Benz Car - Sakshi
Sakshi News home page

Ashu Reddy: అషురెడ్డికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిన తండ్రి, ధరెంతంటే..

Sep 15 2022 4:55 PM | Updated on Sep 15 2022 6:03 PM

Ashu Reddy Birthday Gift By Her Father That Mercedes Benz Car - Sakshi

అషురెడ్డి.. సోషల్‌ మీడియా యాజర్లకు, బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌ షోతో రాత్రి రాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకున్న ఆమె తరచూ తన హాట్‌హాట్‌ ఫొటోలతో ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. ఇలా నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ క్రమంలో ఆమె ఎన్నోసార్లు ట్రోల్స్‌ బారిన కూడా పడింది. ఇదిలా ఉంటే గురువారం ఆమె పుట్టిన రోజు. సెప్టెంబర్‌ 15 ఆమె బర్త్‌డే సందర్భంగా తన తండ్రి నుంచి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ అందుకుంది అషు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. అషు బర్త్‌డే సందర్భంగా ఆమె తండ్రి మెర్సిడీజ్ బెంజ్ కంపెనికి చెందిన C200D అనే మోడల్ కారును బహుమతిగా ఇచ్చాడు.

చదవండి: రణ్‌వీర్‌ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్‌! అసలేం జరిగిందంటే..

ఇక తండ్రితో కలిసి కారు ముందు ఫోజులు ఇచ్చిన ఫొటోలు ఆమె తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఇక దీనికి ‘సారీ మమ్మీ.. నువ్వు షాకవ్వకు. ఇది డాడీ సర్‌ప్రైజ్‌’ అంటై బ్లూ హాట్‌ ఎమోజీని జత చేసింది. కాగా బర్త్‌డే సందర్భంగా అషు అందుకున్న ఈ బహుమతి కారు ఖరీదు దాదాపు రూ. 70 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ఖరీదైన కారును కానుకగా అందుకున్న అషు ఫుల్‌ సర్‌ప్రైజింగ్‌గా ఫీల్‌ అవుతున్నానంది. ‘ఈ సంవత్సరంలో నేను అందుకున్న సర్ ఫ్రైజ్ బహుమతి ఇది’ అంటూ మురిసిపోతుంది. ఇక ఆమె పోస్ట్‌పై తన ఫాలోవర్స్‌ అషు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

చదవండి: సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రానా

Advertisement
 
Advertisement
Advertisement