'విశ్వంభర'లో మరో టాలెంటెడ్‌ బ్యూటీ.. అఫీషయల్‌ ప్రకటన | Sakshi
Sakshi News home page

'విశ్వంభర'లో మరో టాలెంటెడ్‌ బ్యూటీ.. అఫీషయల్‌ ప్రకటన

Published Fri, May 24 2024 12:19 PM

Ashika Ranganath In Viswambara Sets Officially

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సెట్స్‌లోకి తాజాగా మరో హీరోయిన్‌ చేరిపోయింది. ఈమేరకు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'బింబిసార' ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా కన్నడ బ్యూటీకి విశ్వంభరలో నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కింది.

ఇటీవల 'విశ్వంభర'కు సంబంధించి ఇంట్రవెల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ భారీ షెడ్యూల్‌ తర్వాత చిరంజీవి ఈ సినిమా చిత్రీకరణ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. తాజాగా మళ్లీ షూటింగ్‌ కార్యక్రమాలు స్టార్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఆషికా రంగనాథ్‌ విశ్వంభరలో భాగం అవుతుందని మేకర్స్‌ ప్రకటించారు. ఆషికా ఇప్పటికే అమిగోస్‌, నా సామిరంగ చిత్రాలతో మెప్పించింది. అయితే, పదికి పైగా కన్నడ చిత్రాల్లో ఆమె నటించింది. 

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్‌ దక్కడంతో ఆమె తెగ సంబరపడిపోతుందట.  ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement