క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని వెల్లడించిన బుల్లితెర నటి | Asha Negi About Casting Couch Experience | Sakshi
Sakshi News home page

Asha Negi: పెద్ద స్టార్స్‌ కూడా కాంప్రమైజ్‌ అయినవాళ్లేనంటూ నన్నూ..

Oct 5 2024 4:17 PM | Updated on Oct 5 2024 4:38 PM

Asha Negi About Casting Couch Experience

బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ఓ పేరు సంపాదించుకుంది ఆశా నేగి. పదేళ్లుగా టీవీ ఇండస్ట్రీలోనే రాణిస్తున్న ఈ బ్యూటీ కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో కోఆర్డినేటర్స్‌ ఉండేవాళ్లు. ఏదైనా అవకాశాలున్నాయంటే వీళ్లే చెప్పేవాళ్లు. అలా ఓ వ్యక్తి నాకు తారసపడ్డాడు. 

కొన్నింటికి ఓకే చెప్పాలంటూ..
తనతో మీటింగ్‌ కూడా అయింది. అప్పుడు నాకు ఇరవై ఏళ్లు. టెలివిజన్‌ ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది.. ఇక్కడ కొన్నింటికి ఓకే చెప్పాల్సి వస్తుంది. అప్పుడే నీకు ఎదుగుదల ఉంటుంది. పెద్ద పెద్ద టీవీ స్టార్లు కూడా ఈ పద్ధతిలోనే పాపులారిటీ తెచ్చుకున్నారు అన్నాడు. అతడి ఉద్దేశం ఏంటో అర్థమైంది. 

ఆసక్తి లేదన్నా
తను చెప్పినట్లే చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందీ అంటే అలాంటి కెరీర్‌ నాకు వద్దే వద్దనుకున్నాను. నాకు ఏమాత్రం ఆసక్తి లేదని అతడి ముఖం మీదే చెప్పాను. ఈ సంఘటనను నా ఫ్రెండ్‌తో షేర్‌ చేసుకున్నా.. ఇలాంటివి సర్వసాధారణం అని చాలా సింపుల్‌గా అనేశాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఆశా నేగి పవిత్ర రిష్తా సీరియల్‌లో పూర్వీ దేశ్‌ముఖ్‌గా పేరు తెచ్చుకుంది. బారిష్‌, హనీమూన్‌ ఫోటోగ్రాఫర్‌ వెబ్‌ సిరీస్‌లలోనూ నటించింది.

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement