Aryan Khan : షారుక్‌ కొడుకు ఆర్యన్ ఖాన్‌ ఎంట్రీ.. కానీ హీరోగా కాదట

Aryan Khan To Make His Debut As Writer For An Web Series - Sakshi

సాధారణంగా స్టార్‌ హీరోల వారసుడు అంటే హీరోగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కుమారు ఆర్యన్‌ ఖాన్‌ మాత్రం రచయితగా అరంగేట్రం చేయబోతండటం విశేషం. తనకు హీరోగా నటించాలని లేదని, తెరవెనుక తన టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకున్నాక అప్పుడు నటన గురించి ఆలోచిస్తానని ఆర్యన్‌ ఇదివరకే చాలాసార్లు చెప్పాడు.

తాజాగా ఆయన ఓ కామెడీ వెబ్‌సిరీస్‌ కోసం కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్‌ని బేస్‌ చేసుకొని ఈ కథ ఉంటుందట. కాగా గతంలో డ్రగ్స్‌ కేసులో భాగంగా ఆర్యన్  జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్యన్‌ సోదరి సుహానా ఖాన్‌ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ‘ది అర్చీస్’ అనే వెబ్‌సిరీస్‌లో ఆమె నటిస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top